Nawaz Sharif Is Ordered Removed: Pakistan SC గద్దె దిగు నవాజ్.. సుప్రీంకోర్టు అదేశం..

Pakistan supreme court disqualifies prime minister nawaz sharif

pakistan PM, Nawaz Sharif, Supreme Court, Panamagate case, military rule, india, pakistan

Pakistan’s top court on Friday disqualified Prime Minister Nawaz Sharif from office after a damning corruption probe into his family wealth, cutting short his third stint in power.

పాకిస్థాన్ ప్రధాని దోషే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గద్దెదిగాలని అదేశం

Posted: 07/28/2017 01:08 PM IST
Pakistan supreme court disqualifies prime minister nawaz sharif

పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్ కు అ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చెక్కెదురైంది. పానామా గేట్ ద్వారా వెలుగుచూసిన కుంభకోణాలలో ఆయన ప్రమేయం వుందని నిర్థారించిన న్యాయస్థానం నవాజ్ షరీప్ ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. వెనువెంటనే ఆయనను ప్రధాన ి పదవికి రాజీనామా చేయాలని అదేశించింది. ఆయనపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పోలీసులను అదేశించింది  

ఈ కేసులో ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటుగా ఆయన కుటుంబసభ్యులను కూడా దోషులుగా నిర్థారించింది న్యాయస్థానం. అయితే గతంలో కూడా పెద్ద మొత్తంలో కుంకోణానికి పాల్పడి పదవీచ్యుతుడైన నవాజ్ షరీష్ కు మరోమారు అదే ఎదురైంది. నవాజ్ షరీఫ్ అక్రమంగా వెనుకేసుకున్న సొమ్ముతో లండన్‌లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోళ్లు చేశారని, పలువురు బినామీల పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోళ్లు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది.

ఈ అరోపణలపై విపక్షాలకు చెందిన పార్టీలు ఆయన అవినీతిపై విచారణ జరపాలని అ దేశ సుప్రీంకోర్టును అశ్రయించడంతో.. న్యాయస్థానం అదేశాల మేరకు కదిలిన పాక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రస్తుతం, షరీఫ్‌, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిపై కీలక తీర్పును వెలువరించిన న్యాయస్తానం షరీప్ ను దోషిగా నిర్థారించింది. ఆయనతో పాటు అయన కుటుంబసభ్యులపై కూడా కేసులు నమోదు చేయాలని అదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan PM  Nawaz Sharif  Supreme Court  Panamagate case  military rule  india  pakistan  

Other Articles