Nitish Kumar Resigns As Bihar CM ముఖ్యమంత్రి రాజీనామా.. ముదిరిన రాజకీయ సంక్షోభం

Nitish kumar resigns as bihar chief minister says conscience pricked me

nitish kumar resigns, nitish kumar resigns as bihar cm, nitish kumar kills his son, nitish kumar ditches grand alliance, nitish kumar tejaswi yadav, Nitish Kumar,Tejashwi Yadav,Lalu Yadav, grand alliance, RJD, JDU, Congress, BJP

Nitish Kumar has quit as Chief Minister of Bihar, ending the two-year-long political experiment that was branded as Maha-gathbandhan or Grand Alliance which included his party, Lalu Yadav and the Congress.

ముఖ్యమంత్రి రాజీనామా.. ముదిరిన రాజకీయ సంక్షోభం

Posted: 07/26/2017 09:25 PM IST
Nitish kumar resigns as bihar chief minister says conscience pricked me

బీహార్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. తన కొడుకు లాంటి మహాకూటమిని తానే ఎందుకు చంపుకుంటానని వారం రోజుల క్రితం వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎట్టకేలకు అంతపనీ చేశారు. మహాకూటమిని నట్టేట ముంచేసి.. తన దారి తాను చూసుకున్నారు. ఇవాళ రాత్రి బీహర్ గవర్నర్ ను కలసిన ఆయన తన రాజీనామాను సమర్పించారు.  అధికార పార్టీ జేడీయూ, ఆర్జేడీ మధ్య వివాదం కారణంగానే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై సీబిఐ దాడుల నేపథ్యంలో ఆయనను రాజీనామా చేయాలని అదేశించినా.. అందుకు తేజస్వి యాదవ్ నిరాకరించడంతో కనీసం వివరణనైనా ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు తాము వివరణ ఇస్తాము కానీ, ప్రభుత్వ పరంగా ఎందుకు వివరణ కోరుతున్నారని తేజస్వీ యాదవ్ మెలిక పెట్టారు. దీంతో నితీశ్, లాలూ మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశానని, సంకీర్ణ భాగస్వామ్యంలోని కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్వయంగా మాట్లాడానని, ఎన్ని ప్రయత్నాలు చేసినా, సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో ఇక చేసేది లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని భావించానని, అయితే కొన్ని సంఘటనల కారణంగా తాను పని చేసే వాతావరణం సరిగా లేకపోవడంతో తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నడపడం కష్టంగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని నడపగలిగినంత కాలం నడిపానని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు తన అంతరాత్మ అంగీకరించలేదని, అందుకే, తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

బీహార్ ప్రజల అభివృద్ధి కోసం, వారి ప్రయోజనాల కోసమే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బీహార్ అభివృద్ధే తన జీవితాశయమని, ఆ పని చేయలేనప్పుడు ఆ పదవి తనకు అనవసరమని, ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడినని, చివరి క్షణం వరకూ దానికే కట్టుబడి ఉంటానని నితీశ్ కుమార్ అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Tejashwi Yadav  Lalu Yadav  grand alliance  RJD  JDU  Congress  BJP  

Other Articles