ఎన్నారైలకో గుడ్ న్యూస్.. ఇది వాళ్లిద్దరు వల్లే సాధ్యమైంది | Centre Ready to amend law for NRI voting rights

Nris may get to vote from foreign

Supreme Court, Nagender Chindam, Shamsheer V P, NRI voting rights, NRI Votes, e-ballot voting India, India Abroad Votes, SUpreme Court NRI Rights, E Postal Ballot, NRI Votes

Supreme Court asks Centre to apprise it on issue of NRI voting in polls. Will amend law to allow NRIs to vote in their own country says Centre to SC.

ఎన్నారైలకు గుడ్ న్యూస్

Posted: 07/22/2017 08:37 AM IST
Nris may get to vote from foreign

ఓటు హక్కు అన్నది కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదని, దానిని ప్రజల మనోభీష్టానికే వదిలేయాలని మొన్నామధ్యే కేంద్రం సుప్రీంకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే కేవలం భారతీయులకే కాకుండా ఇక్కడ పుట్టి విదేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయుల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించే ప‌నిలో కేంద్రం ఇప్పుడు ముంద‌డుగు వేసింది. ఈ అవ‌కాశం క‌ల్పించ‌డం కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయ‌డానికి తాము సుముఖంగా ఉన్న‌ట్లు సుప్రీంకోర్టుకు తెలియ‌జేసింది.

సుప్రీంకోర్టు ఆదేశానుసారం 3 నెలల్లోగా ఇందుకు సంబంధించిన వివ‌రాల‌న్నీ అంద‌జేస్తామ‌ని కేంద్రం, ఎన్నికల సంఘం ప్ర‌కటించాయి. తమకు ఓటు హక్కు లేకపోవటం మూలంగా ప్రతీ నియోజక వర్గానికి 18,000 వేల ఓట్లు లెక్క తప్పుతున్నాయని, తామూ ఆ అవకాశాన్ని కోల్పోతున్నామంటూ యూకేకు చెందిన ప్రవాసి భారత్ చైర్మన్ నాగేందర్ చిందమ్, కేరళ ఎన్నారై షంషీర్ వీపీ లు దేశ ఉన్నత న్యాయస్థానం తలుపుతట్టారు.

దీంతో కోర్టు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ని అనుసరించి వివరణ కోరగా.. ప్ర‌వాస భార‌తీయుల ఓటు హక్కుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వారి కోసం ప్ర‌త్యేకంగా పోస్ట‌ల్ బ్యాలెట్ లేదా ఎల‌క్ట్రానిక్ బ్యాలెట్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిఫారసు చేసిన మేర‌కు ఈ సౌక‌ర్యాలకు సంబంధించి త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  NRI  Voting Rights  Supreme Court  

Other Articles