Where are the Rs. 2000 notes? ట్రావెల్ బ్యాన్ పై పీజే కురియన్ సంచలన వ్యాఖ్యలు

The rs 2000 question where have the pink notes gone

Demonetization, Shortage of Rs. 2000 notes, Cash shortage, High-value currency, SBI, RBI, ATM, Banks, Reserve Bank of India, Pink notes, High value currency notes

A shortage of Rs 2,000 notes in recent weeks and months has stumped bankers and ATM operators who are already grappling with cash shortage in some parts of the country due to heavy usage and hoarding.

ప్ఛ్..! ఆర్బీఐ వాటిని తగ్గించేస్తుంది..

Posted: 07/20/2017 08:05 PM IST
The rs 2000 question where have the pink notes gone

దేశంలో డీమానిటైజేషన్ చేపట్టిన తరువాత కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకోచ్చిన దేశంలోనే అత్యంత పెద్ద విలువైన రూ. 2000 కరెన్సీ నోటును దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ నోటు కనిపించడం లేదు. ఏ ఏటీయం కేంద్రంలో డబ్బును విత్ డ్రా చేసినా.. బ్యాంకుల్లో వాటిని కోసం ఎదురు చూసినా అవి కనిపించడం లేదు. అయితే వాటి స్థానంలో కేవలం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.5 నోట్లు..మాత్రమే దర్శనమిస్తున్నాయి.

పాత పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో భాగంగా తొలుత ఈ నోట్లనే ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావడంతో ప్రజలు చిల్లర దొరకక నానా కష్టాలు పడ్డారు. అయితే తాజా పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ నోట్లు కోసం ఎంత వెతికినా కనిపించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ఆ కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది. 2000 రూపాయి నోట్ల సరఫరాను తగ్గించి, ఆర్బీఐ ఎక్కువగా కొత్త రూ.500 నోట్ల సరఫరాపై దృష్టిసారించినట్టు ఈ రిపోర్టు నివేదించింది.

ప్రస్తుతం ఎక్కువగా రిజర్వు బ్యాంకు నుంచి అధికంగా ఎక్కువ విలువ కలిగిన నోట్లలో 500 రూపాయి నోట్లే వస్తున్నాయి'' అని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నీరజ్‌ వ్యాస్‌ చెప్పారు. కేవలం 2000 రూపాయి నోట్లను రీసర్క్యూలేషన్‌ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదన్నారు. ప్రీ-డీమానిటైజేషన్‌ సమయంలో ఉన్న నగదు కంటే తక్కువగానే ప్రస్తుతం మార్కెట్‌లో నగదు ఉందని కూడ అర్థిక నిఫుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అసలు అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త రూ.2000 నోట్లు ఎక్కడున్నాయి. ఏవరి ఖాజానాలో బంధీగా మారాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 2000 notes  RBI  demonetisation  Currency  ATMs  Banks  Shortage  

Other Articles