UP Govt Slashed Funds for Education యోగీ ప్రభుత్వంపై విమర్శలు.. ఎందుకో తెలుసా..?

Up yogi adityanath government slashed funds for education

UP Government, Yogi Adityanath, Webqoof, UP Budget Session, Uttar pradesh, Rahul Gandhi, congress, Arvind kejriwal, AAP, Delhi, Akhilesh Yadav, laptops, students, basic education

The Uttar Pradesh Yogi Adityanath government recently presented its first budget slashing funds from last years Rs 15,632 to current year Rs. 5,867 for basic education.

యోగీ ప్రభుత్వంపై విమర్శలు.. ఎందుకో తెలుసా..?

Posted: 07/19/2017 06:28 PM IST
Up yogi adityanath government slashed funds for education

అభివృద్ది, శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భధ్రత కారణాలను చెప్పి అధికారంలోకి వచ్చిన యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం.. హామీలు ఇచ్చింది వేరు.. అచరణలో అమలు చేస్తున్నది వేరా..? అంటే అవునన్న అంటున్నాయి విపక్షాలు. ఆయన ప్రభుత్వంలోని మంత్రివర్యులే.. స్వయంగా నేరాలను అదుపు చేయడం సాధ్యం కాదని, అందులోనూ ఇంత పెద్ద రాష్ట్రంలో అసలు కుదరదని.. అయితే నేరాలు చేసిన వారిని మాత్రం తాము ఎట్టి పరిస్థఇతుల్లో వదలబోమని కూడా చెప్పి విమర్శపాలైన తరువాత మరోమారు యోగీ సర్కార్ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

యోగీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర శాసనసభలో తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెటే ఇందుకు కారణమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో ఆ రాష్ట్ర అర్థికశాఖ మంత్రి రాజేష్ అగర్వాల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రాథమిక విద్యాకు ప్రభుత్వం కేటాయించిన నిధులే విమర్శలకు కారణమయ్యాయి. రాష్ట్రంలో నిరక్షరాస్యత యువతను బడి బాట పట్టించేందుకు అంతకుముందున్న అఖిలేష్ ప్రభుత్వం.. ఏకంగా విద్యార్థినులకు లాప్ టాప్ లను అందించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించగా, యోగీ సర్కార్ మాత్రం విద్యా నిధులకు భారీగా కోత విధించింది.

అంతకుముందు ఏడాది కేటాయించిన నిధులకు.. యోగా సర్కార్ కేటాయించిన నిధులకు ఏమాత్రం పొంతన లేకుండా వున్నాయి. ఏకంగా పది వేల కోట్ల రూపాయల మేర ప్రాథమిక విద్య కేటాయింపులలో కొత పడింది. అఖిలేష్ ప్రభుత్వం కేటాయించిన రూ. 15,632 కోట్లకు బదులు యోగీ ప్రభుత్వం తమ బడ్జెట్ లో కేవలం రూ. 5,867 కోట్లను మాత్రమే కేటాయించడం విమర్శలకు తావిస్తుంది. ఈ కేటాయింపులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. సీఎం యోగీ నిధులను పొదుపు చేయాలని భావిస్తున్నట్లు వున్నారని.. అందుకనే విద్యా నిధులలో కోత పెట్టారని, ఇక రానురాను అస్పత్రులను కూడా మూయించి మరిన్ని నిధులను పొదుపు చేసుకోవాలని వ్యంగంగా ట్విట్ చేశారు.

ఇక అమ్ అద్మీ పార్టీ అయితే మరో అడుగు ముందుకేసి.. ఉత్తర్ ప్రదేశ్ తో ఢిల్లీని పోల్చి తమ ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులను కూడా యోగీ ప్రభుత్వ కేటాయింపులతో సరిపోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఢిల్లీలో కోటీ 80 లక్షల మంది వుండగా, ఉత్తర్ ప్రదేశ్ లో 20 కోట్ల మంది వున్నారని, అయితే ఢిల్లీలో తమ ప్రభుత్వం రూ.11 వేల 300 కోట్లను ప్రాథమిక విద్య కోసం కేటాయించగా, యోగీ సర్కార్ మాత్రం రూ.576 కోట్లను మాత్రమే కేటాయించిందని, ఇక తలసరి ఒక్కో విద్యార్థిపై తమ ప్రభుత్వం రూ.6277 కేటాయిస్తుండగా, యోగీ ప్రభుత్వం మాత్రం రూ.11.52 కేటాయింస్తుందని సరిపోల్చారు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్ జనులకు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. యోగీ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా కొందరు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP Government  Yogi Adityanath  Webqoof  UP Budget Session  Uttar pradesh  

Other Articles