TR Zeliang appointed new Nagaland CM ఆ మాజీ సీఎంకే ముఖ్యమంత్రి పీఠం.. 22లోగా బలనిరూపణ

Tr zeliang to swear in as new nagaland cm asked to prove majority

Governor, PB Acharya, former CM, TR Zeliang, sworn-in ceremony, prove majority, Shurhozelie Liezietsu, Imtiwapang, assembly speaker, Nagaland Peoples Front, Gauhati High Court, Nagaland, politics

Nagaland Governor PB Acharya invited former Chief Minister TR Zeliang to be sworn-in as CM on 19 July at 3:00 pm. Acharya asked him to prove majority on or before 22 July.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండీ: మాజీ సీఎంతో గవర్నర్

Posted: 07/19/2017 03:08 PM IST
Tr zeliang to swear in as new nagaland cm asked to prove majority

ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. అయితే అయన వెనుకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేంత శాసనసభ్యుల బలం వుంది. దీంతో ఆ మాజీ సీఎంనే ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఇవాళ సాయంత్రమే ఆయనను ప్రమాణ స్వీకారానికి అహ్వానిస్తూ లేఖను పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్వాగతించారు. అంతేకాదు ఈ నెల 22లోగా తన బలాన్ని శాసనసభలో నిరూపించుకోవాలని కూడా సూచించారు. ఏంటీ ముఖ్యమంత్రిని గవర్నర్ ఎంపిక చేయడమేంటి.. అందూలోనూ మాజీ సీఎంకు పిలిచి మరీ అధికారం ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..?

నాగాలాండ్ తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వున్న లీజిత్పు తన పదవిని కోల్పోయారు. ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ అచార్య ఇచ్చిన గడువులోపు తన బలాన్ని నిరూపించుకోవాల్సి వుండగా, తనకు బలం లేదని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఆయన సభకు కూడా హాజరుకాలేదు. దీంతో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా జెలియాంగ్ సీఎంగా గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగాఈ నెల 22లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని జెలియాంగ్ కు గవర్నర్ అచార్య స్పష్టం చేశారు.

నాగాలాండ్ లో సంక్షోభం ఎలా తలెత్తిందంటే.. మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ లీజిత్పు ప్రభుత్వానికి ఎదురు తిరగారు. అంతేకాదు అసెంబ్లీలో తనకే అధిక శాసనసభ్యుల మద్దతు వుందని తనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని గవర్నర్ ఆచార్యకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సీఎం లీజిత్పు ప్రభుత్వాన్ని అదేశించారు. అయితే గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన లీజిత్సు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన గువాహటిలోని కోహిమా బెంచ్‌ న్యాయస్థానం గవర్నర్‌ ఆదేశాలపై జులై 17 వరకు స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జులై 18న మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బలపరీక్షకు సిద్ధమవ్వాలని గవర్నర్ సీఎం లీజిత్సును సూచించారు. ఇందుకోసం ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి లీజిత్సు గానీ.. ఆయన మద్దతుదారులు గానీ హాజరుకాలేదు. వారితో ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని స్పీకర్ ఇమ్తివపాంగ్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంగా జెలియాంగ్ ను ప్రకటిస్తూ.. గవర్నర్‌ నిర్ణయం తీసుకుని 22లోగా బలాన్ని నిరూపించుకోవాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  PB Acharya  former CM  TR Zeliang  Shurhozelie Liezietsu  Imtiwapang  Nagaland  politics  

Other Articles