Astrologers to set up practice in Bhopal, like doctors మధ్య ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లకు పోటీగా జ్యోతీష్యులు

Astrologers to set up practice in bhopal like doctors to diagnose and solve problems

astrologers, diagnose, Vedic karmakanda, shivraj singh chouhan, Maharashi Patanjali Sanskrit Sansthan, soothsayers, astrology OPD, vastu experts, palmists, horoscopes, lifelines

The Madhya Pradesh government is planning to start astrology OPD (out-patient department) in which astrologers and such soothsayers will provide consultation to visitors facing diverse problems.

బీజేపి ప్రభుత్వం వింత అలోచన.. ఇక రోగులకు జ్యోతీష్యం ఫ్రీ

Posted: 07/17/2017 12:50 PM IST
Astrologers to set up practice in bhopal like doctors to diagnose and solve problems

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వింత అలోచన చేసింది. ప్రజలకు వచ్చే రోగాలకు జాతకంతో లింకు పెట్టి.. అస్పత్రులలో వైద్యానికి బదులు జోతిష్యం చెప్పించే చర్యలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇది నిజమేనా.. అంటే ముమ్మాటికీ నిజమే. రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. జ్యోతిష్యంతోనే రోగాలను నయం చేస్తామంటూ నమ్మబలుకుతుంది. ఇక రోగాలకు మాత్రలు బదలు.. రోగులు వారి కర్మఫలాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధమైన ఓపీడీలు కూడా ప్రజల ముందుకు రానున్నాయి. ఇక అస్పత్రులలో డాక్టర్లకు పోటీగా జ్యోతిష్యులు కూడా తిష్టవేయనున్నారు.

ముందుగా భోపాల్ లోని రెడ్ క్రాస్ భవనానికి సమీఫంలో వున్న యోగా కేంద్రంలో తొలి జ్యోతిష్య ఔట్ పేషంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు, సందర్శకులకు వారి జాతకాన్ని బట్టి వారి అనారోగ్యాన్ని అంచనా వేయనున్నారు. అందుకు తగిన చికిత్సలు కూడా అందించనున్నారు. భోపాల్ లోని మహారాశి పతంజలి సంస్కృతీ సంస్థాన్ నుంచి జ్యోతిష్యంలో పట్టా పుచ్చుకున్న వారికే అక్కడ ఉద్యోగాలిస్తారు. జ్యోతిష్కులు, వాస్తు నిపుణులు, హస్త సాముద్రికులు, వైదిక కర్మకాండలు చేసేవాళ్లు పేషెంట్ల జాతకాన్ని, జీవిత కాలాన్ని నిర్ణయిస్తున్నారు. రోగంతోపాటు జాతకం కూడా చెబుతారు. మీ రోగానికి గ్రహాలే కారణమని కూడా తేల్చేస్తారు. గ్రహాలకు శాంతి చేయిస్తే నయం అవుతుందని సూచనలు, సలహాలు ఇస్తారు.

ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జ్యోతిష్యం, వాస్తు, హస్త సాముద్రికం లాంటి మూఢ విశ్వాసాలు(కొందరి వాదన)ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తే ఇక డాక్టర్లు ఎందుకు అని నిలదీస్తున్నారు శాస్త్రవేత్తలు. ఔట్ పేషంట్ విభాగంలోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి మరీ జ్యోతిష్యం చెప్పించటం ఏంటో అర్థం కాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మన దేశం ఏకంగా అగ్రభాగన నిలచేందుకు పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి అలోచనలను స్వయంగా ప్రభుత్వాలే ప్రజల ముందుకు తీసుకురావడం పలు విమర్శలకు దారితీస్తుంది. జాతకచక్రాల ఛట్రంలో పడి అలోపతి వైద్యానికి దూరంగా వుంటున్న వారిలో అవగాహన కల్పించి.. వారికి మెరుగైన వైద్యసౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వమే ప్రజలను మళ్లీ అనాదిరోజుల్లోకి పంపాలని భావించడం సమంజసమేనా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  astrologers  diagnose  Vedic karmakanda  shivraj singh chouhan  horoscope  

Other Articles