అసెంబ్లీలో అది కూడా ఎమ్మెల్యే సీటు కిందే బాంబు లభించటంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ స్పందించాడు.ఇది ముమ్మాటికీ ఉగ్ర కుట్రే అని ప్రకటించిన యోగి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నాడని ఒప్పేసుకున్నాడు. దేశ అత్యున్నత ఉగ్రవాద నిర్మూలన విచారణ సంస్థ ఎన్ ఐఏ తో దర్యాప్తునకు ఆదేశించాడు. విద్రోహ చర్య వెనకాల ఉన్న నిందితులను కటకటాల వెనక్కి పంపాల్సిందేనంటూ పిలుపునిచ్చాడు.
యూపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన తనీఖీల్లో ఓ ఎమ్మెల్యే కుర్చీ కింద పౌడర్ లాంటి పదార్థం లభించింది. ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపగా పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే శక్తివంతమైన ప్లాస్టిక్ పేలుడుపదార్థంగా గుర్తించారు. 60 గ్రాములే అయినప్పటికీ దాని ప్రభావం చాలా దారుణంగా ఉండేదని నివేదికలో వెల్లడైంది. దీంతో దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీలో పేలుడుకు కుట్ర పన్నటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
ఇది 22 కోట్ల యూపీ ప్రజల సెంటిమెంట్ కు సంబంధించింది. కుట్ర వెనుక ఉందెవరో వెలుగులోకి తీసుకొస్తామని సీఎం యోగి ప్రకటించాడు. ఇకపై ప్రతినిధులతో మొబైల్ తో లోపలికి రావటం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతీ గేట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి పాస్ లు ఉన్నవారినే లోపలికి అనుమతించాలని పేర్కొన్నాడు. అయితే అసెంబ్లీ పేలుడుకే కుట్ర జరిగిందంటే లా అండ్ ఆర్టర్ ఎంత దయనీయంగా ఉందోనంటూ సమాజ్ వాదీ పార్టీ విమర్శలకు దిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more