sons brutally attacked father for legacy in karnataka వీళ్లు పుత్రులు కాదు.. పుట్టలోని చెదలు..

Sons brutally attacked father for his property in bagalkot karnataka

son brutal act on father, sons brutally attack father, sons father property, father sons relationship, father, sons, property, ningpura village, bagalkot, social media, karnataka

sons brutally attacked father for his property, tied his hand and legs and dragged him up to his feild in the outskirts of ningapura village near bagalkot of karnataka. Local youth filmed this brutal act and posted it on social media

వీళ్లు పుత్రులు కాదు.. పుట్టలోని చెదలు...

Posted: 07/13/2017 07:46 PM IST
Sons brutally attacked father for his property in bagalkot karnataka

తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి? వాడు గిట్టనేమి?.. పుట్టలోని చెదలు పుట్టదా... గిట్టదా! అని సహజకవి వేమన చెప్పిన పద్యం తెలుగువారందరికీ గుర్తండే వుంటుంది. కొన్ని శతాబ్దాల క్రితం ఎందుకని చెప్పారో.. లేక ఎవరిని చూసి చెప్పారో కానీ.. ఇప్పుడు అదే అక్షరాల నిజమవుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులపై దయ, జాలి, ప్రేమ లేని పుత్రులు.. పుట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే అని ఎందుకన్నారో తెలయదు కానీ మమతానురాగాలకు గరిష్టంగా వున్న అరోజుల్లో ఈ పద్యం భవిష్యత్ తరాల కోసం చెప్పారా అనిపించేలా వుంది. ఇక ఇప్పటి తండ్రీ కొడుకుల మధ్య దూరమవుతున్న సంబంధ బంధవ్యాలను చూస్తే ఆయన మరెలా స్పందించేవారో వారో అని అనిపించకమానదు. ఆస్తులు, అంతస్థులు మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తూ కన్నవారి పట్ల కర్కోటకులుగా మారేందుకు దోహదం చేస్తున్నాయి.

డబ్బు అన్నది కేవంల మానవ జీవిత అవసరాలకు మాత్రమే.. కూడు, గుడ్డ, గూడులను సమకూర్చునేందుకు మాత్రమేనన్న సత్యాన్ని మర్చిపోయిన ఇద్దరు పుత్రులు.. పుట్టలోని చెదలు కన్నా హీనంగా తమకు జన్మనిచ్చిన తండ్రితో వ్యవహరించారు. కాళ్లు చేతులు కట్టేసి,, ఈడ్చుకుపోయారు. కనీసం వృద్దుడన్న కనికరం కూడా లేకుండా దాడులకు యత్నించారు. ఈ దారుణ ఘటన ఉత్తర కర్ణాటకలోని బగల్ కోట్ ప్రాంతంలోని నింగపుర గ్రామంలో చోటుచేసుకుంది. అస్తి కోసం ఇద్దరు కోడుకులు తండ్రిని హింసకు గురిచేశారు. ఇంటి వద్ద నుంచి పొలం వరకు ఈడ్చుకెళ్లారు. ఈ పుత్రాల రాక్షసకాండను గ్రామస్తులు వీడియో తీసి నెట్ లో పెట్టడంతో పుత్రుల కర్కషత్వంపై నెట్ జనులు దుమ్మెత్తిపోస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. షేకప్ప మనగూళి (80) తన స్వార్జితంతో ఇల్లు, పోలం కొనుక్కున్నాడు. అయితే అస్తులు పంచాలని ఆయన కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాతే ఆస్తులు పంచుకోవాలని.. అప్పటివరకు రాసి ఇవ్వనని తండ్రి తేల్చిచెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకులు.. ఆయనను కిందపడేసి కాళ్లు చేతులు కట్టేశారు. అపై దాడి చేశారు. అంతటితో అగకుండా తమ ఇంటి నుంచి ఊరి చివరనున్న పోలం వరకు ఈడ్చుకెళ్లారు. ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తామని.. లేదంటే అక్కడే చావు అని చెప్పారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరించిన ఊరిలోని కుర్రోళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్రామ యువకుల నుంచి అందిన పిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరి కొడుకులను అరెస్ట్ చేశారు. పొలంలోని పెద్దాయనను ఇంటికి తీసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : father  sons  property  ningpura village  bagalkot  social media  karnataka  

Other Articles