Nizamabad Woman Killed in Road Accident in New Jersey

Telangana woman died in car accident in usa

New Jersey, Indian Woman, Road Accident, Telangana woman died New Jersey, US Indian Woman Died, US Accident Dichpally Woman Died, Dichpalle Woman Died in US, Indian Woman US Death, New Jersey Gopalam Jyothi, Gopalam Jyothi Husband, TRS Gopalam Vidyasagar, Gopalam Sunil

Indian Woman Killed in Road Accident in New Jersey. Gopalam Jyothi who belongs to Nizamabad Dichpally died in spot. Her Husband Sagar and son David severely injured.

న్యూజెర్సీలో నిజామాబాద్ మహిళ మృతి

Posted: 07/12/2017 09:16 AM IST
Telangana woman died in car accident in usa

అమెరికాలో మరో తెలుగువాసి దుర్మరణం పాలయ్యారు. న్యూజెర్సీలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ డిచ్ పల్లికి చెందిన గోపాలం జ్యోతి(31) అనే మహిళ మృతి చెందింది. ప్రమాదంలో ఆమె భర్త, 20 నెలల బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం ధర్మారం(బి)కి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ప్రొఫెసర్‌ గోపాలం విద్యాసాగర్‌ కుమారుడిదిగా తెలుస్తోంది.

విద్యాసాగర్ తనయుడు సునీల్‌ సాగర్‌ న్యూయార్క్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైజరీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గతంలో సునీల్ దంపతులు గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో మూడేళ్లు ఉద్యోగాలు చేసి, కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆదివారం రాత్రి వారంతా షాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యి జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సునీల్‌పాటు 20 నెలల కుమారుడు డేవిడ్‌ సాగర్‌ కు తీవ్ర గాయాలవ్వగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం గురించి మంగళవారం ఉదయం సునీల్‌ స్నేహితులు విద్యాసాగర్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అమెరికాలోని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమాకు ఫోన్‌ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం న్యూజెర్సీలో ఉన్న జాగృతి నాయకులకు ఫోన్‌ చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. జ్యోతి మృతదేహాన్ని తొందరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని న్యూజెర్సీ అధికారులకు విజ్పప్తి చేసినట్లు సునీల్‌ తండ్రి విద్యాసాగర్‌ మీడియాతో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  New Jersey  Road Accident  Indian Woman Died  

Other Articles