vajra drivers using navigator tab to watch blue films ఈ డ్రైవర్లు వజ్రాలే.. చేతులు స్టీరింగ్ పైన.. కానీ చూపులు..

Tsrtc vajra drivers using navigator tab to watch blue films

tsrtc vajra bus drivers, vajra bus drivers blue films, vajra bus navigator tab blue films, rtc drivers blue films, drivers using navigator tab to watch blue films, tsrtc, vajra bus, navigator tab, blue films, passengers, police, crime

tsrtc vajra drivers using navigator tab to watch blue films while they are driving the bus. one such inncident was reported to police by passenger in janagoan

ఈ డ్రైవర్లు ‘వజ్రాలే’.. చేతులు స్టీరింగ్ పైన.. కానీ చూపులు..

Posted: 07/05/2017 05:32 PM IST
Tsrtc vajra drivers using navigator tab to watch blue films

ఆర్టీసీ ఈనాటికి రాష్ట్ర ప్రగతి చక్రమే. సాధారణ రాష్ట్ర ప్రజలను వార్వారి గమ్యస్థానాలకు చేర్చే విభాగమే. పూర్తిగా లాభాపేక్షతో కాకుండా ప్రజల సౌకర్యార్థం ఏర్పడిన సంస్థే అర్టీసి. అర్టీసీ బస్సులో ప్రయాణం సుమధురం.. సురక్షితం అంటూ అధికారులు ఎన్నెన్నో కొటేషన్లను బస్సుల్లో, బస్సుల వెనకాల రాసినా.. బస్సు సిబ్బందిలో మార్పు మాత్రం రావడం లేదు. అదేంటి అంతమాట అనేశారు..? బస్సు పిబ్బంది అంటే బస్సు డ్రైవర్, కండక్టరేగా.. వారిలో మార్పేంటి అంటారా..? అయితే ఇది అందరు డ్రైవర్ల విషయం కాదు.. కానీ కొందరు చేసే పనుల వల్ల అందరూ అబాసుపాలవుతుంటారు.

మరీ ముఖ్యంగా డ్రైవింగ్ సీటులో వున్న డ్రైవర్ ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. క్షణాల్లో పదుల సంఖ్యలో ప్యాసింజర్ల ప్రాణాల మీదకు వస్తుంది. అందుకనే వారి చేతులు స్టీరింగ్ మీద వున్నంత పేపు వారి దృష్టి మాత్రం రోడ్డు మీదే వుండాలి. ఈ విషయం వారికి తెలిసిందే అయినా.. కొన్ని డిఫోల్లో వారికి బస్సులిచ్చే ప్రతీసారి మళ్లీ మళ్లీ ఈ విషయాన్ని అక్కడి అధికారులు డ్రైవర్లకు చెబతుంటారు. అయినా తీరుమారని కొందరు డ్రైవర్లు మాత్రం వాటిని ఈ చెవితో విన్నామా... అ చెవితో వదిలేశామా..? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వజ్రా బస్సులలో నావిగేషన్ కోసం అధునాతన ఫీచర్లున్న ట్యాబ్ లను కూడా పోందుపర్చిన విషయం తెలిసిందే. కానీ కొందరు డ్రైవర్లు ఈ ట్యాబ్ లను బ్లూ ఫిల్మ్స్ చూడటానికి వినియోగిస్తూ.. ప్రయాణికుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జనగామలో చోటు చేసుకుంది. వరంగల్‌–2 డిపోకు చెందిన TS03Z0340 నంబరు గల వజ్ర బస్సు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వస్తుంది. స్టేషన్ ఘన్ పూర్ లో బస్సు కుదుపులకు లోనైంది.

దీంతో ప్రయాణీకుడు నాగలింగానికి అనుమానం వచ్చి చూడడంతో నేవిగేషన్‌ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్‌లో డ్రైవర్ బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడు డ్రైవర్. వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌ను నిలదీయడంతో తమనే బెదిరించే ప్రయత్నం చేయడంతో బస్సుతో సహా తీసుకెళ్లి జనగామ డిపోలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎలాంటి చిత్రాలు చూడటం లేదని డ్రైవర్ బుకాయించాడు. యూ ట్యుబ్‌ తెరవగానే అవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా విషయాన్ని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsrtc  vajra bus  navigator tab  blue films  passengers  police  crime  

Other Articles