Nandyal By Poll Oppositions try to Create Clashes in Bhuma Family

Akhila priya confidence on nandyal by poll

Nandyal By Poll, Bhuma Nagireddy Elder Brother Sekhar Reddy, Bhuma Brahmananda Reddy, Akhila Priya Shilpa Mohan Reddy, Akhila Priya Brother Brahmananda Reddy, Akhila priya Party Clashes, Nandhyal By Election Bhuma Family Clashes, Akhila Priya Sister Mounika, Bhuma Akhila Priya YSRCP, Bhuma Mounika YSRCP, Bhuma Mounika Nandyal Elections

Akhila Priya Confident on Nandyal By Election. Alleges YSRCP try to create clashes in her family. Bhuma Mounika wants to participate later Bhuma Brahmananda Reddy finalised.

అఖిలప్రియ అడ్జస్ట్ మెంట్ గురించి విన్నారా?

Posted: 07/03/2017 10:38 AM IST
Akhila priya confidence on nandyal by poll

దివంగత భూమానాగిరెడ్డి వారసురాలు, ఏపీ మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్లలో కాస్త అసంతృప్తి నెలకొన్నప్పటికీ, నంద్యాల ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఆమె ప్రయత్నంకు మాత్రం మంచి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వైసీపీపై ఆమె ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తమ కుటుంబంలో చిచ్చుపెట్టాలన్న ప్రత్యర్థుల కుట్రను బయటపెట్టింది.

ఒకానోక దశలో తమ కుటుంబంలో కూడా విభేదాలు తెచ్చే ప్రయత్నం చేశారని, అయితే వాటన్నింటిని దాటుకుని తాము బరిలో నిలిచామని ఆమె చెప్పింది. ముందుగా నంద్యాల బైపోల్ బరిలో తాను దిగుతానని తన చెల్లెలు మౌనిక తనతో చెప్పినట్లు అఖిల వెల్లడించింది. అయితే తన చెల్లెలుకి తానే సర్ది చెప్పి సోదరుడు బ్రహ్మానందరెడ్డిని ఎన్నికల బరిలో నిలిపానని ఆమె అంటోంది. ఈవిషయంలో అధినేత చంద్రబాబు కూడా తనపై నమ్మకంతో నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, అందుకు ప్రత్యేకంగా కృతజ్నతలు తెలుపుతున్నానని ఆమె అంది. సీనియర్లు తనపై గుర్రుగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను పార్టీలో అందరితోపాటే ముందుకు సాగుతానని, అలాంటిదేమైనా ఉంటే తనకిప్పుడు ఇంత మద్ధతు లభించేందే కాదు కదా అని చెబుతోంది.

ఉప ఎన్నిక తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నదని, తన తండ్రి చేయాల్సిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతతో ఆడబిడ్డగా తాను మాట్లాడుతున్నానన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గెలుపు ముమ్మాటికీ టీడీపీదేనని, తన తండ్రి ఈ లోకంలో లేకపోయినా సీఎం తోడ్పాటుతో అభివృద్ది చేస్తున్నామన్నారు. కేవలం ఎమ్మెల్యే పదవి కోసం శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ వీడాడని, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ చెయొద్దన్న ప్రాథమిక సూత్రాన్ని వైసీపీ మరిచిందిన మండిపడింది. ఓడితే దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తానని గతంలో చేసిన సవాల్ ను మరోసారి గుర్తు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal By Election  Bhuma Akhila Priya  Brahmananda Reddy  

Other Articles