President Duterte Ordered Troops to Kill Ordinary People

Philippines president duterte sensational comments

Philippines President, Rodrigo Duterte, Rodrigo Duterte Statement, Rodrigo Duterte Order, Rodrigo Duterte Troops, Rodrigo Duterte Civilians, Rodrigo Duterte Sensational, Rodrigo Duterte, Rodrigo Duterte Shocking Comments, Philippines Terror Attacks

Philippines President Rodrigo Duterte Orders Troops To Fire On Civilians If It Means They Can Kill More Terrorists. The President vows to rebuild Marawi and Made this controversial comments.

జనాలను చంపేయండి.. నేను చూసుకుంటా!

Posted: 06/30/2017 09:05 AM IST
Philippines president duterte sensational comments

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ ఈసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చేతిలో తుపాకీ కనిపిస్తే చాలూ, వారు ఎవరైనా సరే కాల్చి చంపేయండి అంటూ పోలీసులకు, సైన్యానికి పిలుపునిచ్చాడు. ఒకవేళ వాళ్లు సాధారణ ప్రజలు అయినా సమస్యే లేదు.. కాల్చి పడేయండి అంటూ వ్యాఖ్యానించాడు.

పొరపాటున పౌరులను చంపేసినా చట్టబద్ధంగా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చాడు. దేశంలోని దక్షిణ ప్రాంతమైన మరావిలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్లతో పోరాడుతున్న సమయంలో అక్కడ పౌరులు ఉన్నారని సంశయించాల్సిన పనిలేదని, కాల్చి పడేయాలని ఆదేశించాడు. అయితే పౌరులను చంపడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. దాడులు జరుగుతున్న సమయంలో దాక్కోవటం లేదా అక్కడి నుంచి పారిపోవటం లాంటివి చేయాలని సూచించాడు.

రోడ్రిగో అధికారంలోకి వచ్చాక డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మధ్య వర్తిలుగా పని చేసిన వేలాది మంది అమాయకులను పోలీసులు కాల్చిచంపారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా, దేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధిని తీసేశానని రోడ్రిగో వివరణ ఇచ్చుకున్నాడు.

ఆ సమస్య తగ్గిందనుకున్న లోపే ఉగ్ర దాడులు ఫిలిఫైన్స్ ను, రాజధాని మనీలాను గజగజలాడిస్తున్నాయి. ప్రభుత్వ దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు 44 మంది పౌరులు, 71 మంది జవాన్లు, పోలీసులు ప్రాణాలు వదిలారు. మరావి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 4 లక్షల మంది ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా, 299 మంది ఉగ్రవాదులు మట్టుపెట్టిన సైన్యం తిరిగి మరావిని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippines  President Rodrigo Duterte  Terror Attacks  

Other Articles