Police thrashed inmate, inserted lathi in her private parts బైకుల్లా జైలులో రాక్షసుల రాజ్యం.. వెలుగులోకి భయానక నిజం

Police thrashed inmate inserted lathi in her private parts says fir

Byculla, Inmate Death, Manjula Shetya, Manjula Shetya assault by jailors, Manjula Shetya fir on account of eye witness, lathis in Manjula Shetya private parts, jail officer Manisha Pokharkar, Byculla Jail, Mumbai, Indrani Mukerjea, Sheena Bora, Nagpada police station, crime

A horrific assault by jailors that led to the death of Manjula Shetye, 38, in Mumbai’s Byculla jail, says the first information report filed by the police

బైకుల్లా జైలులో రాక్షసుల రాజ్యం.. వెలుగులోకి భయానక నిజం

Posted: 06/27/2017 03:57 PM IST
Police thrashed inmate inserted lathi in her private parts says fir

దేశ అర్థిక రాజధాని ముంబైలోని బైకుల్లా జైలులో గత రెండు రోజులుగా మహిళా ఖైదీలు అందోళన బాట పట్టారు. తమ జైలులో అన్యాయంగా ఓ ఖైదిని అధికారులు హత్య చేశారని అరోపిస్తూ సుమారు 200 మంది ఖైదీలు నిరసన వ్యక్తం చేశారు. అందోళన చేస్తున్న వారిలో ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త ఇంద్రాణి ముఖర్జియా కూడా వున్నారు. అందోళనకారులందిరితో పాటు అమెపై కూడా పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఇక మరోవైపు ఈ జైలులో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు.. జైలర్ మనిషా పోకార్కర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అసలేం జరిగింది..?

1996 జనవరి 4న తన సోదరుడి భార్య విద్యా షిత్యే పై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహం చేసిన కేసులో గోదావరి షిత్యే సహా మంజుల షిత్యే ఇద్దరూ దోషులగా నిర్ధారించి న్యాయస్థానం వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ వారు బొంబే హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా వారికి చుక్కెదైంది. ఈ క్రమంలో శిక్షను అనుభవిస్తూ మంజుల తల్లి గోదావరి అనారోగ్యం మరణించింది. కాగా మంజుల షిత్యే మాత్రం ఎర్రవాడ జైలులో శిక్షను అనుభవిస్తుంది. అయితే ఇటీవల అమెను ఎర్రవాడ నుంచి బైకుల్లా జైలుకు బదిలీ చేశారు.

మూడు నెలల క్రితం బైకుల్లా జైలు వచ్చిన మంజుల షిత్యే.. తన సత్ప్రవర్తనతో అక్కడి జైలు అధికారుల దృష్టిలో పడింది. దీంతో అమెను జైలులోని ఓ బ్యారక్ కు వార్డెన్ గా ఎంపిక చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఉదయం అమె తన బ్యారక్ సభ్యుల బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) తీసుకుని వెళ్తుండగా, రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఐదు పావ్ ( బ్రెడ్డు ముక్కులు) తక్కువగా వచ్చాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మేము గుడ్లను దొంగలించామా..? మాపై అభియోగాలను మోపుతావా..? అంటూ మంజులపై పాశవికంగా, అత్యంత దారుణంగా హింసించారు. లైంగికంగా అమానవీయంగా వ్యవహరించారు.

దీంతో జైలర్ ప్రత్యక గది నుంచి మంజుల భరించలేని నొప్పితో తన బ్యారాక్ లోని సెల్ లోకి చేరుకుందని జైలులోని మిగతా ఖైదీలు పేర్కోన్నారు. అనంతరం మరోమారు అమె సెల్ లోకి దూసుకోచ్చిన బిందు నైకేడీ, వసీమా షేక్, షీతల్ షీగొయంకర్, సురేఖా గుల్వే, ఆర్తి షింజ్నీ ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు.. అమెను మరోమారు దారుణంగా హింసించారని ఖైదీలు తెలిపారు. భిందు, సురేఖాలు ఇద్దరు మంజుల కాళ్లను పట్టుకుని ఎడంగా లాగగా, వసీమా తన లాఠీని అమె మర్మాంగంలోకి దూర్చి హింసించిందని ఖైదీలు అరోపించారు.

ఈ ఘటనతో మంజుల ఏడుపులు, పెడబొబ్బలు పెట్టిందని, అమె మర్మాంగాల నుంచి రక్తం కారుతున్నా అమెను పట్టించకున్న నాదుడే కరువయ్యడాని తెలిపారు. అధిక రక్తస్రావం కావడంతో మంజుల బాత్ రూమ్ లో సృహ కోల్పోయి పడిపోయిందని, దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది రెసిడెంట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, ఆయన అదేశాల ప్రకారంలో వెంటనే జెజే అస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా, జెజే అస్పత్రిలో మంజుల షిత్యే చికిత్స పోందుతూ మరణించింది. బైకుల్లా జైలులో రాక్షసుల రాజ్యం నడుస్తుందని అరోపిస్తూ ఖైదీలందరూ అందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్న నగ్పాడ పోలిసులు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు కానిస్టేబుళ్లతో పాటు జైలర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మహిళా ఖైదీని బ్యాటన్‌తో లైంగికంగా వేధించిన నేపథ్యంలో నాగ్పాడ పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో.. ఈ క్రూరంగా హింసించి విషయాలు వెలుగు చూశాయి. ఖైదీలు తాము చూసిన విషయాలన్నింటినీ పోలీసు అధికారులకు చెప్పారు. దీంతో ప్రాథమిక చర్యగా ఐదుగురు కానిస్టేబుళ్లతో పాటు జైలు హెచ్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. ఎఫ్ఐఆర్ పూరైన క్రమంలో వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjula Shetya  Byculla  Inmate Death  Byculla Jail  Mumbai  Indrani Mukerjea  Sheena Bora  

Other Articles