BJP Youth Leader Held in Fake Notes పాతనోట్ల రద్దు లక్ష్యాలకు తూట్ల పోడిచిన బీజేపి నేత

Bjp member arrested near thrissur for printing fake currency

BJYM worker Rakesh, BJYM worker arrested, BJP youva morcha, Thrissur fake currency arrest, Operation Kubera, Remonetisation notes, demonetisation, kerala, BJP, PM modi, Arun jaitley, presidential elections, kerala

Rakesh, a BJP youth wing worker, was arrested in connection with fake currency printing. Fake currency worth Rs 1.37 lakh and printing machines were seized from his house

నకిలీ నోట్లను ముద్రించిన బీజేపి నేత.. ప్రధాని లక్ష్యాలకు తూట్లు

Posted: 06/23/2017 07:42 PM IST
Bjp member arrested near thrissur for printing fake currency

పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూన్న క్రమంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ భారత ప్రజల ముందుకు మీడియా ద్వారా వచ్చి.. నోట్ల రద్దు వెనకనున్న అసలు ఉద్దేశ్యాన్ని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా నల్లధనం ఏరివేత, నకిలీ కరెన్సీ అటకట్టు, అంతర్గత ఉగ్రవాదులకు చేరే డబ్బును నిలిపివేయడం, పోరుగు దేశ ఉగ్రవాద కార్యాకలాపాలను అడ్డుకోవడం అన్నవి ముఖ్య ఉద్దేశాలన్న విషయాన్ని ఆయన చెప్పారు. అయితే బీజేపి పార్టీకి చెందిన యువమోర్చా నాయకుడే ప్రధాని పాతనోట్ల రద్దు లక్ష్యాలకు తూట్లు పోడిస్తే.. నకిలీ నోట్లను ముద్రిస్తే.. సరిగ్గా అదే జరిగింది.

ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఉత్తమ ఇంజీనీరు అవార్డును పోందిన యువకుడు వీఐపీ కారులో కొత్త నోట్లను ముద్రించి నకీలీ నోట్లను చలామణి చేస్తూ చిక్కిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా బీజేపి యువమోర్చ నాయకుడు అదే తరహా అక్రమాలకు పాల్పడి పోలీసులకు అడ్డంగా దోరికిపోయాడు. ఈ యువమోర్చ నేత కేరళలో, యువ మోర్చా ప్రాంతీయ కమిటీ సభ్యుడు కూడా. ఇతను తన ఇంట్లోనే నకిలీ కరెన్సీ ముద్రణ దుకాణం పెట్టేశాడు.

వివరాల్లోకి వెళితే కేరళలోని యువమోర్చా నేత రాకేష, అతని కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో బాగా ధనవంతులు అయ్యారు. రాత్రికి రాత్రి ఇల్లు, కార్లు వచ్చేశాయి. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు రాకేష్ పై నిఘా పెట్టారు. ఇవాళ పోలీసుల అకస్మికంగా దాడిలో దిమ్మదిరిగే నిజాలు బయటపడ్డాయి. రాకేష్ ఇంట్లో దొంగ నోట్లు ప్రింటింగ్ చేసే మెషీన్ పెట్టాడు. రూ.2వేలు, రూ.500, రూ.50, రూ.20 రూపాయలను ముద్రించేవాడని తెలుసుకున్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అచ్చం ఒరిజినల్ నోట్లు మాదిరిగానే నకిలీ నోట్లు ఉన్నాయని.. వీటిని సామాన్యులు గుర్తించటం కష్టమని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటింగ్ మెషీన్ సహాయంతో పెద్ద ఎత్తున నోట్లను తయారు చేస్తున్నారు. వీటిని పెట్రోల్ బంకులు, బార్లు, లాటరీ కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు ఈ విధంగా మార్చారని నిర్ధారణ అయ్యింది. ఓ ఇంట్లో అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ బండారం బయటపడింది. చలామణికి సిద్ధంగా ఉన్న లక్షా 31వేల రూపాయలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles