Bizarre Uniform Protest at British School

Boys wear skirts in uniform protest

Bizarre Uniform Protest, Strict Uniform Protest, Exeter School Protest, Boys in Girls Skirt, School Boys Protest, School Boys Protest,Britain Summer School Protest

School boys show up to school in skirts in protest over strict uniform policy in Britain. At last Management back step on that rule.

స్కూల్లో జంబలకిడి పంబ

Posted: 06/23/2017 01:36 PM IST
Boys wear skirts in uniform protest

నిరసనలు వ్యక్తం చేయటంలో ఇప్పటి జనరేషన్ స్టైలే వేరు. తమకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం రాలేదంటే.. దాని ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు. అందుకు సోషల్ మీడియా కూడా ఓ మంచి ఫ్లాట్ ఫాం అవుతోంది. బ్రిటన్ లో ఓ స్కూల్ నిర్వాహకులు పెట్టిన షరతులను ఖండిస్తూ విద్యార్థులు చేసిన పని ఒక్కసారిగా హైలెట్ అయ్యి వార్తల్లో నిలిచింది. అంతే దెబ్బకు ఆ రూల్స్ ను వెనక్కి తీసుకుంది యాజమాన్యం.

ఎక్సెట‌ర్ సిటీలోని ఇస్కా అకాడ‌మీ నిక్క‌ర్లు వేసుకుని రావ‌డాన్ని నిషేధిస్తూ ఈ మధ్య ఆదేశాలు జారీ చేసింది. గత నెల రోజులుగా చాలా మంది స్టూడెంట్స్ అదే పని చేస్తున్నారంట. అశ్లీలత అన్న సాకును చూపిస్తూ బ్యాన్ చేసేసింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు వెరైటీగా అమ్మాయిల దుస్తుల‌తో విద్యార్థులంతా హాజరై నిరసన తెలిపారు. ఈ విషయం మీడియాలో కూడా ప్రసారం అయ్యింది.

30 మంది విద్యార్థులు ఆడపిల్లలు వేసుకునే స్క‌ర్ట్‌ల‌తో హాజరయ్యే సరికి యాజమాన్యం బిత్తర పడిపోయింది. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం తాను ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అంతేకాదు వారిపై క్రమశిక్షణ పేరిట ఎలాంటి చ‌ర్యలు తీసుకోవట్లేదని హెడ్ అమీ మిచెల్ తెలిపింది. వాతావరణం కాస్త అనుకూలించి ఎండలు తగ్గటంతో గురువారం మరోసారి తల్లిదండ్రులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uniform Protest  British School  Girls Skirts  

Other Articles