ISRO Successfully Launched 31 Satellites

Cartosat 2 series satellite launch by isro

ISRO, ISRO Launch, ISRO 50 Days 30 Launches, ISRO Jaya Ho, NIUSAT Satellite, PSLV-C38, PSLV-C38 Cartosat-2, Cartosat-2 Specialties, Cartosat-2 Lauch, ISRO 31 Satellites Launch, SHAR Sriharikota Success Streak, PSLV History

ISRO 's PSLV-C38 carrying 31 satellites lifts off from Sriharikota. Cartosat-2 series satellite for earth observation along with 30 co-passenger satellites together weighing about 243 kg at lift-off into a 505 km polar Sun Synchronous Orbit with its rocket Polar Satellite Launch Vehicle (PSLV-C38).

ITEMVIDEOS:ఇస్రో ఘనత.. ఇంకో విక్టరీ

Posted: 06/23/2017 10:03 AM IST
Cartosat 2 series satellite launch by isro

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో సక్సెస్ వచ్చి చేరింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను ఆకాశంలోకి ప్రవేశపెట్టి అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలకు వేదిక అవుతున్న నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచే ఈ ప్రయోగం జరిగింది.

పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 సగర్వంగా నింగికెగసింది. 9.29 కి కౌంట్ డౌన్ మొదలుకాగా, 31 ఉపగ్రహాలతో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తూ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ 17వ ప్రయోగం ద్వారా ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సహా మరో 8 దేశాలకు చెందిన ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోశాట్‌-2ఇ(712 కేజీల బరువు), (మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు), తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని.. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

 

భూగర్భజలాల సమాచారాన్ని సేకరించటంతోపాటు మ్యాపింగ్, సముద్రంలో ఉన్న వనరుల పరిశోధనకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. కార్టోశాట్-2ఇ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలందిస్తుంది. కేవలం 50 రోజుల్లోనే 30 ప్రయోగాలు చేసింది ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ కి సంబంధించి ఇది 40వ ప్రయోగం కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  SHAAR  31 Satellites  Cartosat-2  

Other Articles