deepak reddy suspended from tdp party జేసి అల్లుడిని టీడీపీ నుంచి బయటికి గెంటారు..!

Tdp slaps deepak reddy with suspension from party

Deepak Reddy suspended from tdp, Deepak Reddy suspension, Deepak Reddy, JC Diwakar Reddy, Land Scam, land forgery case, TDP Party, JC prabhakar Reddy, TDP MLC, chenchalguda jail, Telangana, Andhra Pradesh

After a week, the TDP party has taken action against its mlc G Deepak Reddy, who was arrested and sent to Chenchalguda jail on 7th of this month in connection with the land scam case.

జేసి అల్లుడిని టీడీపీ నుంచి బయటికి గెంటారు..!

Posted: 06/15/2017 01:43 PM IST
Tdp slaps deepak reddy with suspension from party

జేసి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండ్. అలాంటి జేసి ఇంటి అల్లుడ్ని.. టీడీపీ పార్టీ బయటకు గెంటివేసింది. అదేంటని ఇంత జరిగిందా.. అని అలోచిస్తున్నారా..? అవును. నిజమే. అయితే జేసీ సోదరుల ఇంటి అల్లుడు కాబట్టే అచితూచి అడుగులేసిన టీడీపీ.. భూ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో అరెస్టై చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా చేరిన ఎనమిది రోజుల తరువాత కానీ చర్యలకు ఉపక్రమించలేదు. అది కూడా వామపక్షానికి చెందిన నేతలు దమ్ముంటే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తరువాత మాట్లాడాలని.. అని ఏకంగా పార్టీ అధినేతకు సవాలు విసరడంతో.. పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చర్చించి ఆయనపై చర్యలు తీసుకున్నారు.

దీంతో ఆయనను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూన్నామని ఎట్టకేలకు చెప్పింది. హైదరాబాద్ లో భూముల కుంభకోణంలో అరెస్టైన దీపక్‌రెడ్డిని బహిష్కరించాలని డిమాండ్ గట్టిగా వినిపించడంతో.. ఇవాళ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడైన దీపక్ రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు ఈ నెల 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు ప్రయత్నించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepak Reddy  JC Diwakar Reddy  Land Scam  land forgery case  TDP Party  Telangana  

Other Articles