Shooting at UPS centre in San Francisco kills four అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం..

Shooting at san francisco ups centre 4 dead including gunman

San Francisco shooting, shooting at san francisco, UPS warehouse shooting, United Parcel Service, package-sorting center, driver, gunman, San Francisco, terrorism

A driver armed with a handgun opened fire at a United Parcel Service Inc package-sorting center in San Francisco on Wednesday, killing three people before fatally shooting himself as officers closed in.

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం..

Posted: 06/15/2017 11:48 AM IST
Shooting at san francisco ups centre 4 dead including gunman

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ సంస్థలోని ప్యాకేజీ సార్టింగ్ కేంద్రంలో ఓ సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారిని కాల్చి చంపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి యూపీఎస్ లో డ్రైవర్ గా గుర్తించారు పోలీసులు. ఆయన తన తోటి డ్రైవర్లపై గన్ తో విచక్షణా రహితంగా కాల్పులు జరపాడని పోలీసులు తెలిపారు.

ఈ దుర్ఘటనలో సాయుధ దుండగుడి సహచర డ్రైవర్లు ముగ్గురు అసువులు బాయగా, ఆ తరువాత సాయుధ డ్రైవర్ కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎక్కడ ఉగ్రవాద కోణం కన్పించడం లేదని, ఉగ్రవాదానికి, ఈ ఘటనకు సంబంధమే లేదని సాన్ ఫ్రాన్సిస్కో అసిస్టెంట్ పోలీస్ ఛాప్ టోని చాప్లిన్ తెలిపారు.ఈ ఘటనలో మరో ఇద్దరు ఉద్యోగులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారని, దాంతో వారిని జుకర్ బర్గ్ లోని శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ అస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు.

ఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు డ్రైవర్ ఒక్కసారిగా కాల్పులు జరపడానికి గల కారణమేంటన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. అగ్రాజ్యంలో గన్ కల్చర్ ప్రజల ప్రాణాలను హరిస్తుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా సైతం తన పదవీకాలం ముగుస్తున్న క్రమంలో ఈ విషయమై అందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి నేరాలు కొత్త రూపు దాల్చుకున్నాయి. పరాయి దేశస్తులను టార్గెట్ చేస్తున్న అక్కడి వారు వలసవాదులపై కాల్పులకు తెగబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : San Francisco shooting  UPS warehouse shooting  driver  gunman  San Francisco  terrorism  

Other Articles