Punjab Inspector held for drug trafficking వీడు పోలీసోడికి తక్కువ.. డగ్ర్స్ మాఫియాకి ఎక్కువ

Punjab s drug recovery specialist arrested after drugs recovered from his own residence

punjab drugs, punjab drugs trafficking, policeman held in drugs case, drugs trafficking case, inderjetsingh, punjab police officer, Crime Investigating Agency wing, Kapurthala, arrest, punjab, crime

Around 3 kg of smack, 4 kg of heroin, an Italian-make pistol, an AK 47 rifle and around 400 live cartridges including those of AK 47s together with cash worth Rs 16 lakh were found Inderjit Singh house in Jalandhar's police lines.

వీడు పోలీసోడికి తక్కువ.. డగ్ర్స్ మాఫియాకి ఎక్కువ

Posted: 06/13/2017 12:25 PM IST
Punjab s drug recovery specialist arrested after drugs recovered from his own residence

పంజాబ్ రాష్ట్రంలోని పట్టణ, నగరాలకు చెందిన యువత మాదకద్రవ్యాలకు బానిసలై మత్తులో జోగుతున్నారన్న వార్తలు యావత్ భారతావనిని అందోళనకు గురిచేస్తున్న క్రమంలో.. రాష్ట్రంలో నూతన పరిపాలన పగ్గాలను అందుకున్న అమరేందర్ సింగ్ ప్రభుత్వం.. దానిని కూడా ఎన్నికల ప్రచారఅస్త్రంగా మార్చుకుంది. పంజాబ్ ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పింది. గెలచిన తరువాత కూడా ఇదే విషయాన్ని నవజ్యోత్ సింగ్ సిద్దూ తొలి పత్రికా సమావేశంలో చెప్పారు. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో పంజాబ్ లో మాదకద్రవ్య వ్యాపారుల వెన్నులో వణుకు పుడుతుంది.

ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహిస్తుండగా.. వారి చేతికి చేనును మేసిన కంచె లభించింది. పోలీసు విభాగంలో మాదకద్రవ్యాల రికవరీ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న పంజాబ్ సీనియర్ పోలీసు అధికారే డగ్ర్స్ ను సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిరహించగా సదరు పోలీసులు అధికారి చీకటి కోణం వెలుగు చూసింది. యువతను నిర్జీవులుగా చేస్తున్న డ్రగ్స్‌ దందాలో ఖాకీల ప్రమేయం బట్టబయలైంది. ఏకంగా డ్రగ్స్ రికవరీ చేసే పోలీసు అధికారి ఇంట్లోనే భారీగా మత్తు పదార్థాలు పట్టుబడడం సంచలనం రేపింది.

కపుర్తలా క్రైమ్‌ బ్రాంచ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఇంద్రజిత్ ను ఫగ్వారా ప్రాంతంలోని అయన నివాసంలో దాడులు చేసిన అధికారులు..  4 కేజీల హెరాయిన్‌.. 3 కేజీల స్కామ్, 16 లక్షల నగదుతో పాటు ఏకే 47 రైఫిల్, ఇటాలియన్ పిస్టల్, 400 క్యాట్రిజ్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంద్రజీత్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు సిట్‌ చీఫ్‌ హరప్రీత్‌ సిద్ధూ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles