బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, రబ్రీ దేవి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన ఇద్దరు కొడుకులకు పెళ్లీడు వచ్చిందని చెబుతూ తనకు ఎలాంటి కోడలు కావాలో పేర్కొన్న ఆమె ఆ క్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన లాలూ స్వయంగా వివరణ ఇచ్చుకున్నాడు.
సంస్కారి బాహు(సాంప్రదాయమైన కోడలు) అంటే వంటింటి కుందేలుగా ఉంటూ భర్త పై ఆధారపడి ఉండటం కాదు. ధృడ సంకల్పం, ప్రేమానురాగాలు ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి ఉద్యోగం చేసినా ఫర్వాలేదు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. బీహార్ యువ నేతలుగా, మంత్రులుగా ఉన్నతేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు సాంప్రదాయమైన అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి పేర్కొన్న విషయం తెలిసిందే. మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు చెప్పింది.
లాలు 70వ జన్మదిన వేడుకల సందర్భంగా రబ్రీ పై వ్యాఖ్యలు చేసింది. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ పేర్కొనటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అమ్మాయిలంటే ఇంట్లోకి కుక్కిన పేలులా పడుండలా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో లాలూ ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Sanskari bahu doesn't mean veiled, home bound, dependent lady. It means strong willed, loving, caring lady, whthr working women or housewife https://t.co/7sWidNJo9x
— Lalu Prasad Yadav (@laluprasadrjd) June 12, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more