Fake BPO demanding nude photos of US customers busted లోన్ కావాలా.? న్యూడ్ పిక్ పంపితేనే రుణం..!

Thane cops bust bizzare bpo offering loans to us citizens in lieu of commission nude pics

Fake BPO, Fake call centre, Thane, Mumbai, Rackon enterprises, Fake BPO busted, Mude photos, US Citizen

Thane Crime Branch busted a major fake call center scam in Ambernath and detained at least 25 of its employees for duping US citizens under the guise of offering ‘easy loans’.

లోన్ కావాలా.? న్యూడ్ పిక్ పంపితేనే రుణం..!

Posted: 06/10/2017 06:08 PM IST
Thane cops bust bizzare bpo offering loans to us citizens in lieu of commission nude pics

రుణం కావాలా..? అంటే డబ్బు అవసరం లేనివారు ఎవరుంటారు..? అని అంటారు. కోటీశ్వరుడికి కూడా డబ్బు అవసరముంటుంది. అయితే ఇలా డబ్బు అవసరం వున్నవారిని అసరాగా చేసుకుని వారికి రుణాలను ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి తెరవెనుక మహానీచాలకు పాల్పడుతున్న ఓ బీపిఓ సంస్థపై మహారాష్ట్రలోని థానే పోలీసులు దాడులు నిర్వహించి.. అందులో పనిచేస్తున్న సుమారు 25 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థాణెలో బీపీవో కంపెనీ రెకాన్‌ ఎంటర్‌ ప్రైజెస్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రుణాలు ఇస్తుంటుంది. అయితే 1,000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు 20 నుంచి 30 శాతం కమీషన్‌ తీసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు.

అంతే కాకుండా, లోన్ కు ష్యూరిటీ అంటూ పలు పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు పంపాలని వినియోగదారులను డిమాండ్ చేశారు. అయితే లోన్‌ అవసరమైన పలువురు వినియోగదారులు అలా ఫోటోలు, వీడియోలు పంపడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వాటిని చూసి, షాక్ తిన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ సంస్థపై కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake BPO  Fake call centre  Thane  Mumbai  Rackon enterprises  Fake BPO busted  Mude photos  US Citizen  

Other Articles