Amit Shah controversy comments on Gandhi

Bjp compares national father as wise businessman

Amit Shah, Amit Shah calls Gandhi, BJP Chief, Mahatma Gandhi Ami Shah, Amit Shah Controversy Comments on Gandhi, Gandhi Amit Shah, Amit Shah Gandhi, Gandhi Businessman, Congress Gandhi Dissolve, Gandhi Chatur Baniya AMit Shah, Amit Shah National Father, Chatur Baniya Comments

BJP Chief Amit Shah Controversy Comments on Mahatma Gandhi. He Compares National Father as Businessman for Congress Dissolved Proposal. Congress and TNC Chief Mamata Benarjee Fire on Amit Comments.

కాంట్రవర్సీ: గాంధీ ఓ తెలివైన బిజినెస్ మెన్!

Posted: 06/10/2017 03:23 PM IST
Bjp compares national father as wise businessman

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జాతి పిత గాంధీజీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే క్రమంలో గాంధీ గురించి ప్రస్తావిస్తూ... ఆయన ఓ తెలివైన వ్యాపారవేత్త అంటూ వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఛత్తీస్ గఢ్ లో ఓ కార్యక్రమానికి హాజరైన కమలనాథుడు పై వ్యాఖ్యలు చేశాడు.

గాంధీ ఓ తెలివైన వ్యాపారవేత్త. అందుకే స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశాడు. అంతేకాదు ఓ బ్రిటన్ వ్యక్తి ద్వారా స్థాపించబడిన పార్టీ కొనసాగటం మంచిది కాదన్న భావనకు ఆయన వచ్చే ఆ పని చేయాలని కోరాడంటూ తెలిపాడు. అది నెరవేరకపోగా తర్వాత ఓ కుటుంబం చేతిలోకి వెళ్లి దశాబ్దాలుగా నలిగిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఛత్తీస్ గఢ్ లో మళ్లీ అధికారం కోసం బీజేపీ తీవ్ర ఎత్తున్న యత్నిస్తోంది. ఇందులో భాగంగా అమిత్ షా ఓ ప్రచార వాహనాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించాడు కూడా.

దీనికి కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. హిందూ మహాసభ, సంఘ్ లనే బ్రిటీష్ వాళ్లు విభజన రాజకీయాల కోసం వాడుకున్నారని, ఇప్పుడు ధనికులతో కలిసి కూడా మోదీ ప్రభుత్వం అదే పని చేస్తోందని ఆరోపించింది. అమిత్ షా గాంధీని వ్యాపారిగా అభివర్ణించటం ముమ్మాటికీ అవమానించటమేనని మండిపడింది. జాతిపితపై చేసిన వ్యాఖ్యలపై జాతికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. దీనికి రాహుల్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ తో కౌంటర్ ఇచ్చాడు. మమతా బెనర్జీ కూడా ఓ మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో జాగ్రత్తగా పెట్టుకోవాలని ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP Chief  Amit Shah  Mahatma Gandhi  Chatur Baniya Comments  

Other Articles