విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డిన ఘటన విశాఖలోని వూడా పార్కు వద్ద చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు... ఇద్దరు యువకులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్ుత చేప్టటారు. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హోటల్ లో గతంలో ఉద్యోగం చేసిన శ్రీధర్.. అదే హోటల్ లో ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్న బాదితురాలితో స్నేహం ఏర్పర్చుకున్నాడు.
అయితే బాధితురాలు కూడా మద్యం సేవిస్తుందని తెలుసుకున్న శ్రీధర్.. గతంలో అమెతో ఒకటి రెండు పర్యాయాలు హోటల్ లోనే మద్యం సేవించాడు. దీంతో అమెతో శ్రీధర్ కు కొంత సన్నిహిత్యం ఏర్పడింది. దానినే అదనుగా చేసుకుని అమెకు ఫోన్ చేసిన తాను పార్టీ ఇస్తున్నానని.. తప్పనిసరిగా రావాలని కోరాడు. సరే స్నేహితుడే కావడంతో ఆ ఉద్యోగిని కూడా అక్కడకు నిర్భయంగా వెళ్లింది. అయితే శ్రీధర్ తో పాటు అతని స్నేహితుడ్ని కూడా చూసి షాకైన బాధితురాలు.. తాను మద్యం తాగనని చెప్పింది. అయినా బలవంతం చేసిన శ్రీధర్ అమెతో మద్యం తాగించాడు.
ఆ తరువాత యువతిని తన హోటల్ వద్ద దిగబెడతామని చెప్పి.. వుడా పార్క్ సమీపంలోని నిర్జన, నిషీది ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ తన స్నేహితుడితో కలసి అమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్నేహితురాలన్న కనికరం కూడా లేకుండా ఇద్దరు పైశాచిక మృగాళ్లు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను వుడా పార్కు రోడ్డుపై వదిలేసిపారపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more