Buried alive by gangsters, man calls brother సమాధి నుంచి అన్నకు ఫోన్.. బతికిపోయాడు..

Buried alive by gangsters man calls brother

mobile saves burried man, burried businessman saved in russia, grave, brother, kidnap, Khikmet Salaev, Russia, buried alive, crime

A broke Russian businessman who owed mobsters $750,000 was buried alive and was only freed when he managed to call his brother.

సమాధి నుంచి అన్నకు ఫోన్.. బతికిపోయాడు..

Posted: 06/08/2017 07:10 PM IST
Buried alive by gangsters man calls brother

అప్పు కట్టలేదని బాధితుల ఇల్లాలను తీసుకెళ్లే ఘటనలను మనం అప్పుడప్పుడు తెలుగురాష్ట్రాల్లో చూస్తున్నాం. అంతకుముందు బాధితులను పట్టుకుని ఓ గదిలో పెట్టి వారిన దారుణంగా కొట్టే.. అప్పిచ్చిన డ్బబులు రాబట్టుకునే వారు వ్యాపారులు. అయితే మనవాళ్లేనా ఇంతటి ఘనులు లేక అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితులే వుంటాయా..? అంటే అవునన్నట్లు చెబుతున్నాయి అక్కడ చోటుచేసుకున్న సంఘటనలు రుజువు చే్స్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుందని మరోమారు రుజవైంది. డబ్బులివ్వలేదని ఓ వ్యాపారవేత్తని బతికుండగానే పూడ్చిపెట్టారు.

ఔనా నిజమేనా అంటూ అశ్చర్యపోతున్నారా..? అక్షరాల నిజమేనండీ.. అయితే ఆ వ్యాపారవేత్త వద్ద సెల్ ఫోన్ వుండటంతో.. తెలివిగా అతను సమాధి నుంచే తన సోదరుడికి ఫోన్‌ చేశాడు. దీంతో అదృష్టం కూడా తోడవ్వడంతో బతికి బయటపడ్డాడు. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన కిక్‌మెట్‌ అనే వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టపోయి అప్పు చేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...కిక్ మెట్ అనే వ్యాపారి తన వ్యాపారం నిమిత్తం పలువురి నుంచి అప్పులు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన చేసిన అప్పులు తీర్చలేకపోయారు.

దీంతో ఆయనను దొరకబుచ్చుకున్న అప్పుల వాళ్లు చితక్కొట్టి, ఆయనను సజీవంగా సమాధి చేశారు. దీంతో వ్యాపారి తన జేబులోని సెల్ ఫోన్ తో సమాధిలోంచి సోదరుడు ఇస్మాయిల్ కు ఫోన్ చేసి, తనను సజీవ సమాధి చేశారని చెప్పాడు. దీంతో ఇస్మాయిల్ హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని సమాధిలోంచి తమ్ముడ్ని వెలికి తీశారు. సుమారు నాలుగు గంటలపాటు భూమిలో ఉన్న కిక్ మెట్ అప్పటికే స్పృహ కోల్పోయాడు. దీంతో తమ్ముడిని ఆసుపత్రికి తరలించి, తమ్ముడు చేసిన అప్పుల వివరాలు తెలుసుకుని, వాటిని తీర్చి తమ్ముడ్ని బతికించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : grave  brother  kidnap  Khikmet Salaev  Russia  buried alive  crime  

Other Articles