Sitaram Yechury heckled at AKG Bhavan in Delhi సీపీఎం జాతీయ కార్యదర్శిపై దాడికి యత్నం..

Attempt to manhandle sitaram yechury in delhi

Sitaram Yechury, Upender Kumar, Pawan Kaul, Hindu Sena, Vishnu Gupta, Major Leetul Gogoi, Prakash Karat, Kashmir.

CPI(M) general secretary Sitaram Yechury’s press briefing was interrupted by two members of the Hindu Sena, a fringe right-wing group, who were protesting against an article criticising Major Leetul Gogoi’s actions in Kashmir.

సీపీఎం అగ్రనేత ఏచూరీపై దాడికి యత్నం..

Posted: 06/07/2017 07:54 PM IST
Attempt to manhandle sitaram yechury in delhi

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి యత్నించారు. యధేశ్ఛగా ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. మొదటి అంతస్థులో సీతరాం ఏచూరి నిర్వహిస్తున్న ప్రేస్ కాన్ఫరెన్స్ సభావేదిక వద్దకు వెళ్లి.. అప్పుడే అటుగా వస్తున్న ఏచూరీపై దాడికి యత్నించారు. వారిని గమనించిన సీపీఎం కార్యకర్తలు, పార్టీ నేతలు అడ్డుకోగా, పార్టీ కార్యాలయంలోనే వారు సీపీఎం ముర్తాబాద్ అంటూ.. నినాదాలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉపేందర్ కుమార్, పవన్ కౌల్ దాడికి యత్నించారు. సీతారం ఏచూరి వద్దకు సమీపిస్తున్న వారి పట్ల వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అరోపించారు.

సీపీఎం నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ జమ్మూకాశ్మీర్ లో మేజర్ లీటుల్ గొగోయ్ కు వ్యతిరేకంగా రాసిన కథనాన్ని వ్యతిరేకిస్తూ హిందూసేన కార్యకర్తలు ఈ దాడికి యత్నించారని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా దాడి అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కోన్నారు. అయితే వారి ఏచూరిపై దాడికి మాత్రమే యత్నించారని, కాగా సీపీఎం కార్యకర్తలు మాత్రం తమ కార్యకర్తలపై దాడికి కూడా పాల్పడ్డారని ఆయన అరోపించారు. అయితే ఎవరెన్నీ దాడులు చేసినా.. తాము భారత అర్మీకి వ్యతిరేకంగా ఎవరినీ వ్యాఖ్యానించబోనీయమని చెప్పారు.

కాగా, బీజేపి సంఘ్ పరివార్ గుండాలతో తమపై దాడులు చేయించినంత మాత్రన తాము కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానన్ని నిలపబోమని సీఫీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. తమపై దాడులకు యత్నించి మౌనంగా ఉంచాలన్న ప్రయత్నాలు సాగవని అన్నారు. భారత ప్రజల ఆత్మ సాక్షిగా సాగుతున్న యుద్దంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెరవబోమని చెప్పారు. కాగా ఏచూరిపై దాడికి యత్నించిన ఇద్దరనీ మందిర్ మార్గ్ పోలిస్ స్టేషన్ కు తరలించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles