Presidential election will be on July 17 announces EC రాష్ట్రపతి ఎన్నికలకు మోగిన నగరా.. జూలై 17 ఎన్నికలు..

Presidential election will be on july 17 ec announces schedule

Presidential Elections 2017, Pranab Mukherjee, Election Commission, Election Commission of india, ECI, president, Rashtrapati Bhawan, President of India, Rajya sabha, lok sabha, election news

Ahead of the polls, the EC Nazeem Zaidi addressed the media said, that Pranab Mukherjee, who assumed office in July 2012, is the 13th President of India and his term is ending soon.

రాష్ట్రపతి ఎన్నికలకు మోగిన నగరా.. జూలై 17 ఎన్నికలు..

Posted: 06/07/2017 05:44 PM IST
Presidential election will be on july 17 ec announces schedule

భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికల నగరా మ్రోగింది. ఈ మేరకు ఇవాళ భారత చీఫ్ ఎన్నికల కమీషనర్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా గత ఐదేళ్లుగా సేవలందించిన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. పదవీ కాలం వచ్చే నెల (జులై) 24తో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు అవసరమైన విధివిధానాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ నజీం జైదీ మీడియాకు పలు విషయాలను వివరించారు.

రాజ్యాంగంలోని 324వ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నిలబడే రాష్ట్రపతి అభ్యర్థిని కనీసం 50 మంది ప్రజాపతినిధుల ప్రతిపాదించాల్సి ఉంటుందని, మరో 50 మంది బలపర్చవలసి ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ నజీమ్ జైధీ తెలిపారు. పోటీ చేయాలనుకునే  అభ్యర్థులు ఈ నెల 28లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి వుంటుందని తెలిపారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నామని చెప్పిన జైదీ..  జులై 20న ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles