babri masjid case: BJP leaders relaxed from personal appearance బాబ్రీ కేసులో బీజేపి అగ్రనేతలకు మరింత ఊరట..

Babri masjid case bjp leaders exempted from personal appearance

LK Advani, MM Joshi, Uma Bharti, Babri Masjid Demolition case, Ayodhya, Lucknow CBI court, BJP, Uttar Pradesh,

A special CBI court on Wednesday granted senior BJP leaders LK Advani, MM Joshi and Uma Bharti, facing trial on conspiracy charges in connection with the Babri Masjid demolition case, exemption from personal appearance.

బాబ్రీ కేసులో బీజేపి అగ్రనేతలకు మరింత ఊరట..

Posted: 06/07/2017 11:28 AM IST
Babri masjid case bjp leaders exempted from personal appearance

పాతికేళ్ల నాటి కేసు పునర్ విచారణకు రావడంతో.. ఖంగుతిన్న బీజేపి అగ్రనేతలకు సీబిఐ కోర్టులో మరోమారు మరికొంత ఊరట లభించింది. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కింద కోర్టులు ఇచ్చిన తీర్పుతో ఏకభవించని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ విషయంలో బీజేపి అగ్రనేతలతో పాటు మొత్తం 12 మందిపై అభియోగాలను మళ్లీ దాఖలు చేయాలని అదేశించడంతో.. పునర్విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో బీజేపి నేతలతో పాటు అర్ఎస్ఎస్ నేతలకు కూడా షాకయ్యారు.

ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు విచారణను రోజువారీగా చేపట్టాలని, రెండేళ్లలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సిబిఐ న్యాయస్థానాన్ని అదేశించింది. ఈ క్రమంలో గత నెల 25, 26 తేదీలలో బీజేపి అగ్రనేతలతో పాటు నిందితులందరిపై అభియోగాలను సిబిఐ దాఖలు చేసింది. అయితే అదే సమయంలో ఈ కేసులో బీజేపి అగ్రనేత ఎల్కే అద్వానీ, ఉమాభారతి, మురళీమనోహర్ జోషి, వినయ్ కతియార్ సహా నిందితులందరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో వారు స్వల్ప ఊరటచెందారు.

అయితే రోజువారి విచారణ నేపథ్యంలో తాము ప్రతీ రోజు న్యాయస్థానం ఎదుట హాజరుకాలేమని.. అందుకు కూడా మినహాయింపు కల్పించాలని న్యాయస్థానంలో బీజేపి అగ్రనేతలు పిటీషన్ దాఖలు చేశారు. దానిపై ఇవాళ విచారించిన న్యాయస్థానం.. వారి పిటీషన్ పై సానుకూలంగా స్పందించింది. దీంతో బీజేపి అగ్రనేతలు ఎల్కే అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషీలకు కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. దీంతో బీజేపి అగ్రనేతలకు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మరికొంత ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles