Former Bond girl Molly Peters dies at 75 చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

Bond girl molly peters passed away at 75 just a week after demise of sir roger moore

molly peters died, molly peters death, rip molly peters, molly peters bond girl, james bond actress molly peters, molly peters death reason, molly peters passes away, thunderball actress passes away, James Bond, Molly Peters, Thunderball, bond girl, sir roger moore, hollywood

James Bond actress Molly Peters has died at the age of 75. She appeared opposite actor Sean Connery in the 1965 James Bond offering 'Thunderball'.

చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

Posted: 06/01/2017 10:42 AM IST
Bond girl molly peters passed away at 75 just a week after demise of sir roger moore

చలనచిత్ర పరిశ్రమను విషాదం వెంటాడుతూనే ఉంది. టాలీవుడ్, సాండిల్ వుడ్; హాలీవుడ్ ఇలా ఏ చిత్ర పరిశ్రమను తీసుకున్నా.. అన్ని విషాదాల్లో మునిగాయి. ఇటు టాలీవుడ్ దర్శక రత్న, నటుడు, పాత్రికేయుడు దాసరి నారాయణ రావు మరణంతో శోకసంద్రం అలుముకోగా, అటు కన్నడ చిత్ర పరిశ్రమలో నటదిగ్గజం రాజ్ కుమార్ సతీమణి కూడా కన్నుముశారు. ఇక హాలీవుడ్ లో జేమ్స్‌బాండ్‌ నటుడు రోజర్‌ మూర్‌ తుదిశ్వాస విడిచిన వారం రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ నటి మరణవార్త విషాధాన్ని నింపింది.

జేమ్స్ బాండ్‌ చిత్రాలలో నటిగా యావత్ ప్రపంచాన్ని మొప్పించిన నటి మోలీ పీటర్స్‌ మరణించారన్న వార్తను అమె జేమ్స్ బాండ్ అధికారిక ట్విట్టర్ పేజీ ధృవీకరించింది. 1965లో వచ్చిన జేమ్స్ బాండ్‌ సినిమా ’థండర్ బాల్‌’లో సీన్ కానరీ సరసన హీరోయిన్‌గా మోలీ నటించింది. 75 ఏళ్ల వయస్సులో మోలీ చనిపోయిందని పేర్కొంటూ ఆమె కుటుంబానికి జేమ్స్ బాండ్ అధికారక ట్విట్టర్ పేజీ సంతాపం తెలిపింది. అయితే అమె మరణం ఎలా సంభవించిందన్న విషయమై ఇంకా వివరాలు అందాల్సి వుంది.

1942లో ఇంగ్లండ్ లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన మోలీ మోడలింగ్ లో రాణించి తన కెరీర్ ను ప్రారంభించింది. ప్లేబాయ్, పరేడ్ వంటి మ్యాగజీన్ లలో కనిపించింది. జేమ్స్ బాండ్‌ డైరెక్టర్ టెరెన్స్ యంగ్ అమెలోని నటిగా పరిచయం చేయిందారు. ధండర్ బాల్ చిత్రంలో అమెను కథానాయికగా పరిచయం చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమె ఇక హాలీవుడ్ వ్యాప్తంగా తన అభిమానులను పెంచుకునేలా నటనలో ప్రావిణ్యాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత ఆమె ‘డోన్ట్‌ రైజ్‌ ఆ బ్రిడ్జ్‌, లోయర్‌ ద రివర్‌’ వంటి కామెడీ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో ప్రేక్షకులను అలరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Bond  Molly Peters  Thunderball  bond girl  sir roger moore  hollywood  

Other Articles