former union minister dasari narayana rao passed away దర్శక రత్న దాసరి నారాయణరావు కన్నుమూత..

Veteran tollywood director and former union minister dasari narayana rao passed away

Dasari Narayana Rao, dasai narayana rao passed away, dasari demise, dasari no more, tollywood mourns for dasari, dasari ill health, dasari kims hospital, dasari hyper tension, dasari respiration, dasari passes away, Dasari Health, Dasari Critical Condition, Dasari Condition Serious, Dasari Again Surgery, Dasari Health Bulliten, Dasari Narayana Rao Serious, Dasari Health Bulliten

veteran tollywood director and former union minister dasari narayana rao passed away in kims hospital at hyderabad today. Tollywood celebritries mourns at his demise.

ITEMVIDEOS: దర్శక రత్న దాసరి నారాయణరావు కన్నుమూత..

Posted: 05/30/2017 07:38 PM IST
Veteran tollywood director and former union minister dasari narayana rao passed away

టాలీవుడ్ దర్శక దిగ్గజం.. దర్శకరత్న,కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు (75) ఇవాళ తుది శాస్వ విడిచారు. ఆయన ఆరోగ్యం మరోసారి విషమించడంతో ఆయనను కుటుంబసభ్యులు అస్పత్రితో చేర్పించారు. దర్శకరత్న అకస్మిక మృతితో టాలీవుడ్ లో విషాధ వాతావరణం అలుముకుంది. అధిక రక్తపోటుతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన గుండె స్పందించడం మానివేయడంతో మరణించారు. తెలుగు సినీవినీలాకాశంలో ఓ ట్రెండ్ సెట్ చేసిన ఆయన అకాలమరణం చెందడం పట్ల అనేక మంది సినీ ప్రముఖులు శోకసంధ్రంలో మునిగారు.

అనారోగ్యం బారిన పడిన అయన అధిక రక్తపోటుతో నియంత్రణ కాకపోవడంతో వైద్యులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆయన గుండె అగిపోయిందని, అయితే దానిని తిరిగి పనిచేయించేందుకు అనేకమార్గాల్లో కృషి చేశామని అయినా తమ ప్రయాస వృధా అయ్యిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన అధిక రక్తపోటు వల్ల మరణించాడని చెప్పారు. దీంతో దాసరి కుటుంబసభ్యులు ఆయన బౌతికకాయాన్ని దాసరి జూబ్లిహిల్స్ లోని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. దాసరి మృతి పట్ల సంతాప సూచకంగా తెలుగు సినిమా పరిశ్రమ బుధవారం బంద్ పాటిస్తుందని సినీవర్గాలు తెలిపాయి.

గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. మార్చి5వ తేదీని అనారోగ్యం బారినపడి కిమ్స్ అస్పత్రికి చేరిన ఆయన అక్కడ దాదాపుగా రెండు మాసాలు ఇన్ పేషంట్ గా వున్నారు. ఆ సయంలో ఆయనకు కీ హోల్ సర్జీరీ చేయడం వల్ల ఆయన కొంత కొలుకున్నారు. అయితే అధిక రక్తపోటుతో పాటు కిడ్నీలు కూడా పాడయ్యాయని, దీనికి తోడు శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనూ భాధపడ్డారు. తర్వాత కుదుటపడిన ఆయన ఇంటికి చేరి విశ్రాంతి కూడా తీసున్నాడు. మే 5న ఆయన పుట్టిన రోజు కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే మరోమారు అనారోగ్యం వేధించడంతో ఈ నెల 17న ఆస్పత్రిలో చేరగా, 18న మళ్లీ సర్జరీ చేశారు వైద్యులు. గత 5 నెలల్లో రెండు సార్లు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అది కూడా ఆయన తీవ్ర అనారోగ్యం పాలు కావడానికి కారణమైందన్న వార్తలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasai narayana rao  demise  no more  tollywood  ill health  kims hospital  hyper tension  respiration  passes away  

Other Articles