good news to unemployed aspirants నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో ప్రభుత్వ కొలువుల జాతర

Good news to unemployed aspirants 20 k govt jobs on the way

Telangana state public service commission, TSPSC good news, unemployed aspirants, chairman ganta chakrapani, CM KCR, notification, 20,000 government jobs

Telangana state public service commission gives good news to unemployed aspirants, chairman ganta chakrapani says CM KCR ordered to give notification on 20,000 government jobs.

నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో ప్రభుత్వ కొలువుల జాతర

Posted: 05/30/2017 02:51 PM IST
Good news to unemployed aspirants 20 k govt jobs on the way

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పరిగణలోకి తీసుకుని అదే రోజున నిరుద్యోగులకు శుభవార్తను అందించాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో అర్హులైన వారికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల జాతర నిర్వహించనున్నట్లు ప్రకటనను వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో 20వేల ఉద్యోగాల నియామకాలకు నోటిషికేషన్ ను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాలు జారి చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి ఇవాళ చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో ఇవాళ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగ నియామకాలన్నీ వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. దీంతో నగరంలోని అర్బన్ రెసిడెన్షల్ పాఠశాలల ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు తాము రెడీ అయ్యామని చెప్పిరు. వీటితో పాటు 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 ఉద్యోగాలు, కొత్త జిల్లా కేంద్రాల్లోని 29 పట్టణ గురుకులాల్లో 377 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని సూచించారు. దీంతో పాటు 8792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారని చక్రఫాణి తెలిపారు. సీఎం అదేశాలతో పాటుకళాశాలు, ప్రభుత్వ శాఖల్లో 2437 పోస్టుల భర్తీకి జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles