వావివరుసలు మర్చిపోయి మరీ తొబుట్టువు సమానమైన తమ్మడి భార్యను (మరదలిని) చెరిచిన దారుణ ఘటన గుజరాత్ లో చేటుచేసుకుంది. భార్యపై క్షక్ష తీర్చుకోవాలనుకున్న భర్త అమెను కిడ్నాప్ చేసి తీసుకురాగా పశువుల్లాగా అమెపై పడ్డారు అతని సోదరులు. తన కళ్లముందే తన భార్యపై అఘాయిత్యాన్నికి పాల్పడుతున్నా.. కాపాడండీ అని అరచిని అమె అరుపులు అరణ్యరోదనయ్యాయి. భర్త దగ్గరుండి మరీ తోడబుట్టిన అన్నలతో తన అర్థాంగి మానాన్ని మంటగలుపుతుంటూ చూసి సంతోషించి శాడిస్టును కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ల వినిపిస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని దహోద్ జిల్లాలో గడోయి గ్రామానికి చెందిన యువతి (19)కి సమీప అభ్లోద్ గ్రామానికి చెందిన వ్యక్తితో (20) గతేడాది వివాహం జరిగింది. అయితే వివాహమైన నాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇవి మరింత తీవ్ర రూపం దాల్చడంతో ఆమె ఈనెల 20న పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కక్షగట్టిన భర్త ఆమె జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుని ఈ నెల 24న ఆమె ఇంటికి వెళ్లాడు. జరిగినదేదో జరిగిపోయిందని, ఇకపై భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యంగా కలిసి ఉందామని తనతో ఇంటికి రావాలని కోరాడు.
దీంతో తన భర్తలో మార్పు వచ్చిందని, ఇక భవిష్యత్ బాగుపడబోతోందని ఆమె ఆశపడి అతనితో వెళ్లింది. అప్పుడు కానీ తాను జీవితంలో ఎంత పెద్దతప్పు చేశానో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆశలన్నిటినీ అడియాసలు చేస్తూ, ఇంటికి రాగానే ఆమెను ఒక గదిలో బంధించాడా దుర్మార్గుడు. ఈ లోగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు... తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని, ఆమె జాడ కనిపెట్టాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో మరింత రెచ్చిపోయిన ఆ భర్త దగ్గరుండి, తన ముగ్గురు అన్నలతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. అనంతరం పుట్టింటికి వెళ్లిపోవాలని ఆమెను బెదిరించారు. దీంతో పుట్టింటికి చేరిన బాధితురాలు జరిగిన ఘోరంపై పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని, అతని ఓ అన్నను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు అన్నల కోసం గాలింపు చేపట్టారు. భర్తపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more