Monsoon likely to arrive before May 30 in Kerala: IMD తొలకరులపై తీపికబరు.. భానుడి తాపం నుంచి ఉపశమనం

Monsoon likely to arrive before may 30 in kerala imd

cloud seeding, Harsh Vardhan, India Meteorological Department, Kerala, M Rajeevan, Ministry of Earth Sciences, Monsoon, Rainfall, moderate rainfall

The India Meteorological Department (IMD) may have announced the onset of monsoon in Kerala on 30 May, seasonal rainfall may arrive as sheduled.

తొలకరులపై తీపికబరు.. భానుడి తాపం నుంచి ఉపశమనం

Posted: 05/27/2017 06:34 PM IST
Monsoon likely to arrive before may 30 in kerala imd

ఇనుపెన్నడూ లేని భానుడి తాపాన్ని చవిచూస్తున్న తెలుగు రాష్ట్రప్రజలకు తీపి కబరును అందించింది భారత వాతావరణ శాఖ. ఎండలతో అల్లడుతున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుందని తెలపింది. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని శుభవార్తను అందించింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 30 లేదా 31కి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని చెప్పారు.

అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా 30 వ తేదీ కన్నా ఒక రోజు ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ముందుగానే ప్రకటించిన తేదీల్లోనే కేరళ, మాల్దీవులు, దక్షిణ అరేబియా సముద్రం పరిసరాలను రుతుపవనాలు తాకుతాయని పేర్కొన్నారు. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుకునేందుకు మరో వారం రోజుల వ్యవధి పడుతుందని తెలిపారు.

దీంతో మరో పది నుంచి పక్షం రోజులలో తొలికరులు తెలుగు ప్రజలను పలకరించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ సారి సాధారణం కన్నా అధికంగానే రాష్ట్రంలో రుతుపవనాలు ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా ఇదివరకే వాతవరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల జనజీవన స్రవంతికి ఎలాంటి విఘాతం కల్గకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles