Karnataka CM Siddaramaiah 'dozes off' on Modi Government మోడీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపిస్తుందా.?

Karnataka cm siddaramaiah dozes off on modi government

modi tuglaq rule, upa schemes name changed, bjp unemployment, bjp farmers, bjp orop, aBJP, Congress, Chief Minister Siddaramaiah, B.S. Yeddyurappa, bangalore, karnataka

According to national crime bureau records, Dalit atrocity cases during the rule of the UPA government stood at 32,000 plus cases but now it has seen a quantum leap to 58,000 plus cases," CM siddaramaiah rationalised.

పథకాల పేర్ల మార్పు తప్ప మోడీ సర్కార్ చేసిందేమిటీ..?

Posted: 05/27/2017 03:46 PM IST
Karnataka cm siddaramaiah dozes off on modi government

గత మూడేళ్లుగా మనం తుగ్లక్ పాలనను చవిచూశామా.? అవును దేశప్రజలందరూ గత మూడేళ్లుగా చవిచూసింది తుగ్లక్ పాలనే అని అంటున్నారాయన. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపి విజయ్ దివాస్ పేరిట సంబరాలు చేసుకుంటున్న తరుణంలో.. ఈయనెవరండీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారా.? ఆయన మరెవరో కాదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపి ద్వంద వైఖరిని దేశప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా అధికారంలోకి వచ్చిన తరువాత మరోక మాదిరిగా మాటలు మారుస్తూ ప్రధాని మోదీ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారని సీఎం సిద్ధరామయ్య ఘాటుగా విమర్శించారు.

2014కు ముందు కేంద్రలో అధికారంలోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును, ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియను అప్పట్లో గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ తీవ్రంగా వ్యతిరేకించారని, కేంద్రంలో అధికారంలోకి రాగానే అదే జీఎస్టీ బిలు, ఆధార్‌కార్డు అనుసంధానం ప్రక్రియలను అమలు చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో శంఖుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్టుకుల మోదీ జాతీకి అంకితమిస్తూ అంతా తానే చేశానన్న దోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నారు.

యూపీఏ ప్రభుత్వహయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి బీజేపి ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ సాధించిందేమి లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల భారత్‌ను స్వచ్ఛభారత్‌గా, రాజీవ్‌గాంధీ విద్యుద్ధీకరణ పథకాన్ని... దీన్‌దయాళ్‌ పథకంగా మార్చారని ఎద్దేవా చేశారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రధాని ఆ ప్రభుత్వం తీసుకువచ్చిన పధకాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపి అమలు చేస్తున్న పథాకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనివేనని పేర్కొన్నారు. తాము అధికారంలోకి నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామన్న పెద్దలు.. ఇప్పుడు దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించడం కుదరదని తెగేసి చెబుతున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. గత మూడేళ్లలో కేవలం నాలుగు లక్షలేనని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విదేశాలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని ప్రతీ పేదవాడి అకౌంట్ లో మూడు లక్షల వేస్తామన్న హామీ ఏమైందని నిలదీసిన ఆయన మూడేళ్లలో అది ఎంతవరకు నెరవేరిందని ప్రశ్నించారు. నల్లధనాన్ని నిర్మూలించే ప్రధాన ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఓ మహా నాటకమని, అది కేవలం కొన్ని బడా కార్పోరేట్‌ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపి నేతలకు దళితులు గుర్తుకొస్తారని, అది వారి ఓట్లపై ప్రేమే తప్ప దళితులపై ప్రేమ కాదని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  Chief Minister Siddaramaiah  B.S. Yeddyurappa  bangalore  karnataka  

Other Articles