Telangana RTC Bus Overturns in Anantapur 25 injured

Tsrtc garuda bus accident in anantapur

TSRTC Garuda Bus Accident, Telangana Bus Accident, Anantapur Bus Accident, Bus Overturn in AP, AP Bus Accident, Anantapur Bus Accident, Telangana Bus Accident AP, Bus Overturn Accident

21 injured as TSRTC Garuda Bus topples in Anantapur. 5 persons situation turns critically.

ఘోర ప్రమాదం: బ్రిడ్జిపై బస్సు బోల్తా

Posted: 05/27/2017 08:26 AM IST
Tsrtc garuda bus accident in anantapur

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ గరుడ ఏసీ బస్సు బోల్తా కొట్టిన ఘటన అనంతపురం లో చోటు చేసుకుంది.

శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ts 07z 4071 బస్సు గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద పది అడుగుల వంతెనపై బోల్తా కొట్టింది. ఘటనలో 25 మంది గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

క్షతగాత్రులకు గుత్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అక్కడి నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ లారీని ఓవర్ టేక్ చేసే యత్నంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఘటన పై తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అక్కడి అధికారులకు ఫోన్ చేసి ఆరాతీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana RTC Bus  Overturn  

Other Articles