Rahul Gandhi denied permission to visit Saharanpur ‘‘అయిననూ సహారన్ పూర్ పోయిరావలె’’

Rahul gandhi denied permission to visit saharanpur

Rahul gandhi visit to saharanpur, rahul denied to visit saharanpur, dalit houses torched in saharanpur, Caste violence in Saharanpur, 'well-planned' conspiracy on dalits in saharanpur, ubhash chandra dubey, bablu kumar, Saharanpur, Rahul Gandhi, mayawati, Congress

The Saharanpur district authorities refused permission to Congress Vice President Rahul Gandhi to visit the strife-torn district.

‘‘అయిననూ సహారన్ పూర్ పోయిరావలె’’

Posted: 05/26/2017 02:44 PM IST
Rahul gandhi denied permission to visit saharanpur

కులం కుమ్మలాటలతో అట్టుడికిన ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్ పూర్ కు వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించి తీరుతానని ఏఐసిసి ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధి అన్నారు. బాధితులతో వారికి జరిగిన అన్యాయాన్ని, బాధను పంచుకుంటానని చెప్పారు. సహరన్ పూర్ వెళ్లేందుకు తాను ఎప్పుడో ప్లాన్ చేస్తే పోలీసులు తాను పర్యటించే ఒక్క రోజు ముందు అనుమతి నిరాకరించడం పట్ల అయన అసహనం వ్యక్తం చేశారు.

బాధితులను పరామర్శించేందుకు వెళ్లే తమను కాకుండా.. దళితులపై పేట్రోగిపోయి వారి ఇళ్లను దహనం చేసిన నిందితులను పట్టుకోవడంలో చూపాలని ఆయన కార్యాలయ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కోన్నారు. సహారన్ పూర్ లో దళితుల ఇళ్లను అగ్రవర్ణాలకు చెందిన పలువురు పక్క ప్రణాళికతో చేసిన కుట్రగా ఆయన పేర్కోన్నారు. ఈ ఘటనలో కేవలం ఒక్క ఎస్సీ స్థాయి అధికారిపై సస్సెన్షన్ వేటు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుందని విమర్శించారు.

అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని సహారన్ పూర్ లో కులం చిచ్చు రగిలింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 40 రోజుల క్రితం దళితులు నిర్వహించిన ఓ ర్యాలీతో అగ్రవర్ణాలకు, దళితులకు మద్య చిచ్చు రేగింది. ఆ తదనంతరం ఈ నెల 5న రేగిన ఘర్షణలో ఒకరు మరణించగా, మరో 15 మంది గాయాలపాలయ్యారు. అప్పటికే అగ్రవర్ణాల పంజాధాటికి కుచించికుపోయిన దళితుల వాడపై మరోసారి రెచ్చిపోయారు అగ్రవర్ణాలు. పక్క ప్రణాళికతో రెచ్చిపోయారు,

దళితవాడలోని పూరిళ్లకు నిప్పు పెట్టారు, అదే అదనుగా ఏకంగా 12 పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతలను కాపాడేందుకు 400 మంది పోలీసు బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి సహారన్ పూర్ వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలోని యోగి అధిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేది తామేనని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ఆరు నలలు కాకముందే తమ మాటలకు, శాంతిభద్రతలకు తిలోదకాలిచ్చాయని మాయావతి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subhash chandra dubey  bablu kumar  Saharanpur  Rahul Gandhi  mayawati  Congress  

Other Articles