Pigeon found in Kuwait with backpack full of drugs పావురం అరెస్టు.. పోలీసుల ప్రత్యేక పంజరం..

Pigeon in kuwait caught carrying drugs in bag attached to back

Pigeon arrested, pigeon found in Kuwait, Pigeon arrested in kuwait, Pigeon arrested for smuggling drugs, kuwair police, kuwait Pigeon, Pigeon arrest, Pigeon arrested in kuwait border, Pigeon arrested in abdali near iran border in kuwait

Kuwaiti customs officials have taken a pigeon into custody after the bird was found with 178 pills in a small backpack. The pigeon was found in Abdali, near the border with Iraq.

పావురం అరెస్టు.. పోలీసుల ప్రత్యేక పంజరం..

Posted: 05/26/2017 11:15 AM IST
Pigeon in kuwait caught carrying drugs in bag attached to back

పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా.. అన్నట్లుగా పావురానికి డ్రగ్స్ కి ముడిపెట్టింది స్మగ్లింగ్ ముఠా.. వాళ్లు చేసిన తప్పులు తెలియక కేవలం తనతో పాటు బ్యాగ్ ను మోసుకెళ్లడం వల్ల అమాయక పావురానికి అరదండాలు పడ్డాయి. విచిత్రంగా వుందే అనుకుంటున్నా.. మీరు చదివింది నిజమే. ఒకప్పడు ప్రేమికులకు సందేశాలను పంపేందుకు వినియోగించిన పావురాలు.. ఆ తరువాత వేగులు పంపే సమాచారాన్ని తీసుకెళ్లేవి. తాజాగా స్మగ్లింగ్ ముఠా అదే మార్గాన్ని ఎంచుకుని అమాయక పావురాలను అరెస్టు చేయిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే. కువైట్‌ పోలీసులు ఎగరలేక కష్టపడుతున్న ఓ పావురాన్ని అరెస్టు చేశారు. కువైట్ సరిహద్దు ప్రాంతమైన ఇరాన్‌ నుంచి తమ దేశంలోకి వచ్చిన ఓ పావురం ఎగరడం కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యంది. అయినా కష్టపడుతూ తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. దానిని గమనించిన కువైట్ పోలీసులు తొలుత దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అది కష్టంగా ఎగరడాన్ని గమనించిన తరువాత దానిని తీక్షణంగా గమనించారు. అయితే ఆ పావురానికి  ఓ చిన్న బ్యాగు లాంటిది తగిలించి ఉండడాన్ని పోలీసులు గమనించారు.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని పట్టుకుని బ్యాగ్‌ విప్పి చూడగా అందులో డ్రగ్స్ వున్నాయి. దీంతో అక్రమంగా స్మగ్లింగ్ ముఠా డ్రగ్స్ ను పావురాల ద్వారా తరలిస్తున్నారని అనుమానంతో దానిని అరెస్టు చేశారు. దీంతో ఈ చర్యలకు ఇరాన్ నుంచి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముఠాలపై కూడా కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. కాగా పావురాల ద్వారా ఇలా స్మగ్లింగ్‌ చేయించడం ఇరాన్ స్మగ్లింగ్ ముఠాలకు ఇది తొలిసారి కాదు. 2015లో కోస్టారికాకు చెందిన పోలీసులు ఎగరలేకపోతున్న ఓ పావురాన్ని పట్టుకున్నారు. తీరా చూస్తే దాని పొట్టకి కొకైన్‌ పొట్లాలు తగిలించి ఉండడం చూసి కంగుతిన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pigeon  arrest  kuwait  iran  smuggling  drugs  small bags  kuwait customs officials  

Other Articles