KCR hits back at Amit Shah రాష్ట్రపతి ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు: కేసీఆర్

Kcr hits back at amit shah

cm kcr on amit shah, kcr challenges amit shah, kcr slams amit shah, kcr black money, kcr submerfing 7 mandals, dalit bhojan, GHMC elections, MIM, amit shah, chandrashekhar rao, kcr, telangana, telangana news, narendra modi, bjp national president, news, hyderabad news

Telangana chief minister K chandra shekar Rao slams BJP National President Amit Shah says he didnt had dalit bhojan, it was bought from neighbouring village kammagudem

దళితుల ఇంట తిన్నది అబద్దమే.. చెప్పింది అబద్దమే..

Posted: 05/24/2017 07:14 PM IST
Kcr hits back at amit shah

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపి పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ నేతలకు సూచిస్తూ.. తెలంగాణ లోని నల్గోండ జిల్లాలో పర్యటించిన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం కేసీఆర్ గరమయ్యారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న బీజేపి.. దళితుల ఇంట్లో భోజనం ఎందుకు చేయాల్సి వస్తుందని.. ప్రశ్నించారు. బీజేపి దళిత వ్యతిరేక పార్టీ అన్న ముద్రను తుడిచివేసుకోవాలనే ప్రయత్నంలోనే ఇలా చేస్తున్నారని.. దళితుల ఇళ్లలో బోజనం చేస్తే వచ్చిన అపఖ్యాతి పోతుందా అని ఆయన ప్రశ్నించారు. దళితులపై దేశవ్యాప్తంగా ఓ వైపు దాడులు చేస్తూనే మరో వైపు బోజనాల పేరుతో బీజేపి వారిని మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

దళితుల ఇళ్లలో బోజనం కూడా పూర్తిగా అబద్దంతోనే కూడుకున్నదని ఆయన విమర్శఇంచారు. పక్కనున్న కమ్మగూడెం లోని మనోహర్ రెడ్డి తోటలో వంటలు వండించి తీసుకువచ్చి.. దళితుల ఇంట్లో వాటిని వడ్డించారని అది కూడా దళితుల ఇంట బోజనం ఎలా అవుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల ఇంట్లో బోజనం అంటే వారితో కలసి చేయాలే తప్ప.. వారిని నిల్చోబెట్టి. అమిత్ షా సహా పలువురు నేతలు కూర్చోని తినడం దళితుల ఇంట బోజనం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాలో విమర్శలకు బయపడి ఇవాళ బీజేపి నేతలు దళితుల ఇళ్లలో బోజనం చేస్తున్నారని విమర్శించారు.

దళితుల ఇళ్లలో బోజనం చేసినంత మాత్రాన అది దళిత పార్టీ అయిపోతుందా..? అని ప్రశ్నించారు. అసలు బీజేపి కూడా ఒక పార్టీయేనా అని ఆయన వ్యంగంగా నిలదీశారు. బీజేపి పార్టీ సత్తా ఏంటో జీహెచ్ఎంసీ ఎన్నికలలో తేలిపోయిందని.. ఎంఐఎం ఉన్న ప్రాంతంలో ఒక్క సీటు కూడా బీజేపి గెలువలేక పోయిందని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణ పర్యటనలో అమిత్ షా వల్లెవేసిన అబద్దాలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను చెప్పిన లెక్కలే తప్పని నిరూపించాలని ఆయ‌న స‌వాలు విసిరారు. తాను చెప్పిన లెక్కలు అస‌త్యాల‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని ప్రకటించారు.

గ‌తంలో తెలంగాణ పర్యట‌న సంద‌ర్భంగా కూడా అమిత్ షా ప‌లు వ్యాఖ్యలు చేశార‌ని, తెలంగాణ‌కు రూ.95 వేల కోట్లు ఇచ్చిన‌ట్లు అప్పట్లో అన్నార‌ని చెప్పారు. ఇప్పుడు కూడా అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నార‌ని, అప్పుడు లైట్ గా తీసుకుని వదిలేశామని, ఇప్పడు అదే అబద్దాలను ప్రచారం చేయడం ఒక జాతీయ పార్టీకి సముచితమా..? అని నిలదీశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల గురించి తెలుసుకోకుండా, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నార‌ని అన్నారు. అమిత్ షా ఈ సారి కూడా అద్భుత‌మైన  అబ‌ద్ధాలు వల్లెవేశారని ఎద్దేవా చేశారు.

దేశాన్ని ప‌రిపాలించే పార్టీకి అధ్యక్షుడైన అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. దేశంలో ఏ పార్టీ అయినా తెలంగాణ‌లో బ‌లం పెంచుకోవ‌చ్చని, అయితే, అస‌త్య ప్రచారం చేయకూడ‌ద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంచిచెడ్డలు ప్రజ‌లు నిర్ణయిస్తారని హిత‌వు ప‌లికారు. వాస్తవాలు ఏంటో జ‌నాల‌కి తెలుసని అన్నారు. దేశంలోనే ధ‌నిక రాష్ట్రాల్లో ఒక‌టిగా తెలంగాణ‌ ఉందని, తెలంగాణ ప్రభుత్వ పాల‌సీల‌న్నీ అద్భుతంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజ‌ల బాగోగుల కోసమే త‌మ‌ కృషి అని అన్నారు. తననువ్యక్తిగ‌తంగా మాట‌లు అన్నాప‌డ‌తాను.. కానీ తెలంగాణ వ్యవ‌స్థనే కించ‌ప‌రుస్తూ మాట్లాడితే తన ప్రాణం పోయినా ఊరుకోనని కేసీఆర్ అన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలపై ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  chandrashekhar rao  dalit bhojan  GHMC elections  MIM  kcr  pm modi  telangana  

Other Articles