SpiceJet anniversary sale: Fares start at Rs 12 రూ.12కే విమానయానం.. స్పైస్ జెట్ బంఫర్ అఫర్

Spicejet anniversary sale flight ticket fares starting at just rs 12

spicejet sale, spicejet rs 12, spicejet offer, spicejet ticket, spicejet flight, spicejet ticket fare, flight fares, spicejet discount, flight ticket discounts, flight ticket offers, spicejet offers, airline offers, spicejet airlines, spicejet price, flight ticket price, spicejet ticket booking, spicejet, spicejet website, spicejet deal, airline deal, flight deals

Low-cost airline SpiceJet has announced a sale on the occasion of its 12th Anniversary. Under the special discount offer, SpiceJet is offering deals on both domestic and international flig

రూ.12కే విమానయానం.. స్పైస్ జెట్ బంఫర్ అఫర్

Posted: 05/23/2017 01:35 PM IST
Spicejet anniversary sale flight ticket fares starting at just rs 12

చౌకధరలో విమానయాన అవకాశాన్ని కల్పిస్తున్న ఎయిర్‌లైన్‌ స్పైస్‌ జెట్‌ విమాన విమానయాన ప్రయాణికుల కోసం కనీవిని ఎరుగని రీతిలో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సంస్థ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ విమానాలు వెళ్లే అన్ని దేశీయ మార్గాల్లో అతి తక్కువ, డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. రూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందింస్తోంది. అయితే ఈ కేవలం బేస్ ధర మాత్రమేనని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

ఈ ధరకు అదనంగా అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను ప్రయాణికులనే భరించాల్సి వస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 12 వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని సాగుతన్న అమ్మకాలుగా  ఇవాళ్ట నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం వుంది. ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు ప్రయాణించవచ్చు. అయితే నాన్‌ స్టాప్‌ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ లభ్యం కానుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా పలు ఆపర్లను ప్రకటించింది.
 
పన్నెండు వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరో అద్భుతమైన అక్కీ 12 ఆఫర్ ను కూడా అందిస్తోంది. 12 సాల్, బడా ధమాల్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లో బుక్‌ చేసుకున్న టికెట్లపై  ఉచిత విమాన టికెట్లు, ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ అధికారికంగా పేర్కొంది. స్పైస్ మ్యాక్స్, భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే ఫ్రీ మీల్స్‌, ఫ్రీ ప్రయారిటీ చెక్ ఇన్‌కు కూడా అర్హత పొందవచ్చని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spicejet  rs 12 bumper offer  spicejet offer  ticket fare  anniversary offer  

Other Articles