Rakul Preet Singh Interviews Sachin Tendulkar

Rakul luck with sachin interview

Rakul Sachin, Sachin Rakul, Tollywood Actress Interview Sachin Sachin Biopic,Sachin: A Billion Dreams Movie, Sachin: A Billion Dreams Promotions, Sachin: A Billion Dreams Sachin Rakul Interview, Rakul Proud Moment, Rakul Sachin Complete Interview, Sachin Rakul Interview, Sachin Mahesh Babu, Mahesh Babu Sachin

Actress Rakul Preet Singh interviewed Sachin Temdulkar for Biopic. Tollywood actress Rakul Preet Singh has interviewed Sachin Tendulkar for the promotions of Sachin: A Billion Dreams film. The program will be aired very soon.

అదృష్టమంటే ఆ హీరోయిన్ దే!

Posted: 05/22/2017 12:03 PM IST
Rakul luck with sachin interview

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లైఫ్ కి తీసిన సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. కోట్లాది మంది ఆయన అభిమానులు దాని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తనది రీల్ లైఫ్ కాదని, రియల్ లైఫ్ కాబట్టే నిజ జీవిత సన్నివేశాలతో తీశామని డాక్యుమెంటరీ అంటూ వస్తున్న విమర్శలపై చక్కటి వివరణ ఇచ్చాడు. ఇక ఆయనను కలిసేందుకు, చూసేందకు ఎగబడిపోయే ఫ్యాన్స్ ను చూసి ఉంటాం. కానీ, ఏకంగా సచిన్ నే ఇంటర్వ్యూ చేసింది మన తెలుగు హీరోయిన్.

యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా పాగా వేసిన ఈ భామకు క్రికెట్ దేవుడినే ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కింది. హైదరాబాద్ కు ప్రమోషన్ లో భాగంగా వచ్చిన సచిన్ తో ఓ ఛానెల్ వారు సచిన్ ను ఇంటర్వ్యూ చేయించారు. తాను ఎంతో ఇష్టపడే సచిన్ ను ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ ఇంటర్వ్యూ చేసింది. ఆయన జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలను సంధించింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో పంచుకుంది. క్రికెట్ లెజెండ్ ను ఇంటర్వ్యూ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ట్వీట్ చేసింది. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని... ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెబుతూ సచిన్ తో సెల్పీ దిగి పోస్ట్ చేసింది. సచిన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్' వచ్చే శుక్రవారం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rakul  Sachin Tendulkar  Sachin: A Billion Dreams  

Other Articles