BJP behind Corruption Charges against Lalu Prasad Yadav

Lalu fire on modi govt over corruption allegations

Lalu Prasad Yadav, Lalu Prasad Yadav BJP RSS, BJP RSS, BJP Lalu Corruption, Lalu Uproot Modi Government, Lalu Corruption Charges, Modi RSS Lalu, Lalu Modi Government, Lalu August Rally, Lalu anti Government Rally

Lalu Prasad Yadav alleges BJP, RSS holding grudge on him. Lalu denies 'benami' land deals, vows to 'uproot' Modi government.

మోదీ ప్రభుత్వాన్ని ఖచ్ఛితంగా కూల్చేస్తా!

Posted: 05/19/2017 04:26 PM IST
Lalu fire on modi govt over corruption allegations

బీహార్ రాజకీయ ముఖ చిత్రం నుంచి తనను,తన వారసులను లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని లాలూ విరుచుకుపడ్డాడు.బినామీ పేరిట అక్రమాస్తులను కూడబెట్టుకున్నారన్న బీహార్ బీజేపీ చీఫ్ సుశీల్ మోదీ ఆరోపణలపై లాలూ స్పందించాడు. ఓ కుటుంబ పెద్దగా ఆస్తులను కూడబెట్టడంలో ఎలాంటి తప్పులేదని, అలాగని వాటిని అక్రమాస్తులను ఆరోపించటం సరికాదని చెప్పుకొచ్చాడు.

కేవలం బీజేపీ,మోదీ పై తాను చేసిన వ్యాఖ్యలను పట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదని, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించి తీరుతానని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తెలిపాడు. తన వారసులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్టబద్ధంగా ఆస్తులు కూడబెట్టారని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే తనపై అభియోగాలు మోపారని స్పష్టంగా తెలుస్తుందన్న ఆయన, వారికి తాము డీఎస్ఎస్ పోటీగా పెట్టామన్న కోపంతో ఆర్ఎస్ఎస్ కూడా జతకలిసిందని లాలూ మండిపడ్డాడు. బీజేపీపై పోరాడేందుకు, భవిష్యత్ కార్యాచరణ కోసం ఆగస్టు 27న పాట్నాలోని గాంధీ మైదాన్ లో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. భావ సారూప్యం కలిగిన పార్టీల నాయకులను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పాడు.

 

లాలూ జైలుకు పోవాల్సిందేనా?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Narendra Modi  Corruption Charges  

Other Articles