Indian eatery in UK to close after ‘human meat’ report ఇక్కడ శునకం.. అక్కడ ఏకంగా నరమాంసం..

Indian eatery in uk to close after human meat report

KarriTwist, human meat, Shinra Begum, Indian restaurant in UK, UK news, world news

An Indian restaurant in the UK could be forced to shut down after a fake news report claiming it serves human meat went viral on Facebook, according to a media report.

ఇక్కడ శునకం.. అక్కడ ఏకంగా నరమాంసం..

Posted: 05/18/2017 06:41 PM IST
Indian eatery in uk to close after human meat report

గచ్చిబౌలిలోని షా గౌస్ హోటల్ లో శునకం మాంసాన్ని వడ్డివారుస్తున్నారని ఆ మద్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ కథనం తీవ్ర దుమారాన్ని లేపింది. అయితే దీనిపై ఏకంగా హోటల్ యాజమాన్యం స్పందించి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. ఈ కథనానికి కారణమైన బిజినెస్ స్కూల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తన స్నేహితులు తనను వదిలి వెళ్లి బిర్యాని తినడానికి వెళ్లడంతో వారిని అటపట్టించేందుకు ఈ విధమైన ఫేక్ న్యూస్ ను తాను కేవలం వారికి మాత్రమే పంపానని, అది కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుందని తాను ఊహించలేదని తెలిపాడు నిందితుడు.

సరిగ్గా అలాంటి ఫేక్ న్యూస్ తో ఇప్పుడు లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ మూతపడింది. ఆరు పదులు దాటి.. మంచి రుచితో. సుచితో స్థానికుల మనన్నలు పోందిన హోటల్ లో ఏకంగా నరమాంసం.. అదేనండీ మనిషి మాంసం వండుతున్నారన్న సోషల్ మీడియా కథనాలతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏకంగా రెస్టారెంట్ ను మూసేశారు. దీనికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫేక్ న్యూసే కారణం.

వివరాల్లోకి వెళ్తే..దక్షిణ లండన్ లో నిర్వహిస్తున్న కర్రీట్విస్ట్ రెస్టారెంట్ లో నరమాంసం వండివారుస్తున్నారని ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో ఆ రెస్టారెంట్ యజమానురాలు షిన్రా బేగం పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ తప్పుడు వార్తను నమ్మిన కొందరు తమ హోటల్ ను ధ్వంసం చేస్తామని ఫోన్ ద్వారా హెచ్చరించడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఇది ప్రాంక్ న్యూస్ సైట్ నుంచి గుర్తుతెలియని అగంతకులు సృష్టించిన ఫేక్ న్యూస్ గా కనుగోన్నారు.

ఈ నేపథ్యంలో యజమానురాలు షిన్రా బేగం మాట్లాడుతూ.. పోలీసుల ఎదుట కూడా ఓ వ్యక్తి తమ హోటల్ తెరిస్తే కిటికీలు ధ్వంసం చేస్తానని హెచ్చరించాడని తెలిపారు. ఇక మరికోందరు ఏకంగా పోలీసులకే ఈ విషయమై పిర్యాదు చేశారని అన్నారు. ఈ తప్పుడు కథనాల వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నారు. ఇక మరికోందరు తమకు ఫోన్ చేసి మరీ మనుషి మాంసం వడ్డించడానికి మీకెంత ధైర్యం అంటూ నిలదీస్తున్నారని కూడా తెలిపారు.

తమ హోటల్ కు 60 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయాన్ని కూడా కస్టమర్లు పరిగణలోకి తీసుకోకుండా.. ఎవరో ఏదో రాస్తా.. దానిని మాత్రమే ప్రచారం చేస్తూ.. తమను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని షిన్నా బేగం అవేదన వ్యక్తం చేశారు. ఒక పంక్తిలో చిన్న పారాగ్రాప్ రాసి.. అందులోనూ అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు వుంటూ దానిని నమ్ముతున్నారని అమె విస్మయం వ్యక్తం చేశారు.

మనిషి మాంసం వడ్డిస్తున్న అసియా రెస్టారెండ్ మూతపడింది అన్న శీర్షికతో ఈ న్యూస్ వచ్చిందని అమె తెలిపారు. నరమాంసాన్ని వండివారుస్తున్నారన్న అరోపణలపై హోటల్ యజమాని రార్జన్ పటేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఈ సందర్భంగా వారు తయారు చేస్తున్న అహారంలో మనిషి మాంసం కలుపుతున్నారన్న పోలీసులు కనుగోన్నారని దీంతో న్యూక్రాస్ రెస్టారెంట్ ను పోలీసులు సీజ్ చేశారని వార్త కథనం. పోలీసులు పరిశీలనలో మరో తొమ్మిది మానవ మృతదేహాలు ఫ్రిజ్ లో వున్నాయని.. అవి కూడా మాంసంగా మారేందుకు సిద్దమైనట్లు వున్నాయని తెలిసి వాటిని పోలీసులు స్వాథీనం చేసుకున్నారని కూడా కథనంలో వుంది.

అంతేకాదు హోటల్ సీజ్ చేసిన పోలీసులు రర్జన్ పటేల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఈ నేపథ్యంలో హోటల్ ను మూసివేశారని కూడా ఆ ఫేక్ న్యూస్ లో వుండటం గమనార్హం. అయితే ఈ ఫ్రాంక్ న్యూస్ సైట్లో అనేక తప్పుడు కథలు ప్రచారంలో వుంటాయని.. ఇలా తమ రెస్టారెంట్ పై కథనం ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కస్టమర్లు రావడం లేదని, నిత్యం బిజీగా వుంటే హోటల్ లో ఇప్పుడు సిబ్బందికి పనిలేక కూర్చుంటున్నారని షిన్రా బేగం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KarriTwist  human meat  Shinra Begum  Indian restaurant in UK  world news  

Other Articles