Om Prakash Chautala clears Class 12 with A grade జైలులో ఇంటర్ పాసైన మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా

In tihar jail om prakash chautala 82 clears class 12 with a grade

om prakash chautala, tecaher recruitment scam, punjab teacher recruitment scam, cm om prakash chautala, cm chautala, former haryana cm, india news

Chautala appeared for the Class XII exam conducted by the National Institute of Open Schooling (NIOS) at the centre set up for prisoners at Tihar Jail, where he is lodged.

జైలులో ఇంటర్ పాసైన మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా

Posted: 05/17/2017 11:08 AM IST
In tihar jail om prakash chautala 82 clears class 12 with a grade

ఉపాధ్యాయ నియామకాలలో అవినీతికి పాల్పడి.. ఏకంగా 3206 టీచర్ పోస్టులకు తమకు తాయిలాలు అందించిన వారికి ఉద్యోగాలిచ్చారన్న అభియోగాలను ఎదుర్కోని అవి నిరూపితం కావడంతో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా.. అవినీతికి చదువుతో పనిలేదని ఇప్పటికే నిరూపించగా, చదువుకోవాలంటే వయస్సులో కూడా పనిలేదని తాజాగా నిరూపించాడు. జైలులో వున్న ఆయన ఓ వైపు శిక్ష అనుభవిస్తూనే.. మరో వైపు ఉన్నత విద్యను అభ్యసించి.. పాస్ అయ్యాడు. ఔరా ఇదేం విచిత్రం అంటున్నారా..? కానీ నిజం.

చౌతాలా.. ఏకంగా 82 ఏళ్ల వయసులో ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. ఇప్పటి వరకు కేవలం పదో తరగతి మాత్రమే అభ్యసించిన ఆయన.. తనకు కావాలసినంత తీరిక లభించడంతో.. ఇక ఉన్నత విద్యపై దృష్టి సారించి ఏకంగా ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఇంటర్ తరువాత డిగ్రీ చదవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తీహార్ జైలులోని ఖైదీల కోసం నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇటీవల నిర్వహించిన పరీక్షలకు చౌతాలా హాజరయ్యారు. మరి డిగ్రీ పట్టాను కూడా ఆయన అందుకోవాలని అశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Prakash Chautala  Class XII exam  A grade pass  Tihar jail  former cm  haryana  

Other Articles