I-T raids 22 locations of Lalu Prasad in binami land deals భూమి భుక్కిన నేతకు ఐటీ షాక్.. 22 చోట్ల ఐటీ దాడులు

I t raids lalu prasad yadav kin s residences in rs 1000 crore benami land deals case

lalu yadav, lalu yadav corruption case, lalu yadav land deals, it raids lau yadav, income tax raids lalu yadav, income tax raids delhi gururgram for lalu yadav kin

The Income Tax department conducted raids and surveys at 22 locations in Delhi, Gurugram on the charges of Benami land deals worth Rs 1000 crore, involving Lalu Prasad Yadav.

భూమి భుక్కిన నేతకు ఐటీ షాక్.. 22 చోట్ల ఐటీ దాడులు

Posted: 05/16/2017 12:10 PM IST
I t raids lalu prasad yadav kin s residences in rs 1000 crore benami land deals case

అవినీతికి పాల్పడిన పదవులకు దూరమైనా.. తమ అక్రమాలను కొనసాగించడంలో ఏమాత్రం అడ్డూ అదుపు లేకుండా.. ప్రజలు ఏమనుకుంటారన్న జంకుబోంకు లేకుండా మళ్లీ మళ్లీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు నేతలు. గడ్డి మేసిన కేసులో చిక్కుకుని పదవులకు దూరమైన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు దాదాపుగా పదిహేనేళ్ల తరువాత అయ్యో పాపం అనుకుని అధిపత్యాన్ని అందించిన ప్రజల నెత్తిన మళ్లీ శఠగోపం పెట్టి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల అక్రమాస్థులను కాజేశారని అభియోగాలు రావడం మళ్లీ ఆయన పార్టీ రాజకీయ భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టింది.

బినామి భూములను బొక్కరంటూ అభియోగాలు వెల్లువెత్తని నేపథ్యంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.ఢిల్లీ, గుర్గావ్, రేవారీ ప్రాంతాల్లోని 22 ప్రదేశాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. పలువురు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించిన ప్రదేశాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ, ల్యాండ్ డీల్స్ కు సంబంధించి లాలూ ప్రసాద్, అతని కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలకు చెందిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. వెయ్యి కోట్ల విలువైన బినామీ ఆస్తులు, పన్ను ఎగవేతల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించామని చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీ సహా 22 ప్రాంతాల్లో ఆయన బంధవులు, కూతుళ్లు, కుమారుల నివాసాలపై ఐటీ శాఖ ఇవాళ దాడులు చేసింది. ఆయన ఇద్దరు కుమార్తెలు అక్రమంగా అత్యంత చౌకగా వందల కోట్ల రూపాయల విలువైన భూములను కొనుగోలు చేశారని ఇప్పటికే అభియోగాలు వచ్చాయి. కేవలం కోటి నలభై లక్షల రూపాయలతో ఆయన చిన్న కూతురు వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసిందని.. ఈ ఆధారాలు లాలూ మరోమారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని విపక్షాలు అరోపిస్తున్నాయి. లాలూతో పాటు అతని కుమారులు ల్యాండ్ డీలింగ్స్ లో మునిగిపోయారంటూ బీజేపీ నేతలు ఆరోపించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడులు కొనసాగడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad yadav  benami land deals  I-T raids  Delhi  RJD  JD(U)  

Other Articles