Indira was 'most acceptable' Prime Minister, says President ఇందిరమ్మే ఇప్పటికీ అత్యధిక దేశప్రజలు మెచ్చిన ప్రధాని

Indira gandhi most acceptable pm even today pranab mukherjee

Indira Gandhi, Rahul gandhi, Pranab Mukherjee, Congress, Kashmir, Kanyakumari , Indira Gandhi most acceptable PM even today: Pranab Mukherjee, Sonia Gandhi, Manmohan Singh, Golden Temple, Teen Murti Bhavan, Congress news, India news

President Pranab Mukherjee said Indira Gandhi was still the "most acceptable ruler" of the country and hailed the late Prime Minister for her decisiveness and fearlessness.

ఇందిరమ్మే ఇప్పటికీ అత్యధిక దేశప్రజలు మెచ్చిన ప్రధాని

Posted: 05/14/2017 12:28 PM IST
Indira gandhi most acceptable pm even today pranab mukherjee

రాష్ర్టపతిగా కొనసాగుతున్న ప్రణబ్ ముఖర్జీ.. ఇవాళ అత్యంత కీలమైన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల వ్యవధిలో తన పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఆయన తన మనస్సులోని మాటలను బయటపెట్టారు. స్వతహాగా కాంగ్రెస్ కురువృద్దుడైన రాష్ట్రపతి.. దాదాపుగా 32 ఏళ్ల తరువాత దేశప్రజలు మర్చిపోయిన పేరును తెరపైకి తీసుకువచ్చి.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కొనియాడారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి ఇన్నాళ్లూ బాగానే బండి నడిపించినా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ప్రజల ప్రధాని అంటే ఇప్పటికీ ఇందిరాగాంధీయేనని... నేటికీ ఇండియాలో అత్యధికుల ఆదరణను పొందిన ప్రధాని ఇందిరా గాంధీయేనని ఆయన అనడం సంచలనంగా మారింది. ఇందిరతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె పాలనా దక్షత అమోఘమని ప్రశంసించారు. దేశహితం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపే వేగం తననెంతో ఆకర్షించేదని చెప్పుకొచ్చారు. 1970వ దశకంలో కాంగ్రెస్ విడిపోయి అధికారాన్ని కోల్పోయిన వేళ ఆమె తన మెదడుకు పదును పెట్టి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని చెప్పారు.

ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  20వ శతాబ్దపు నేతల్లో ప్రపంచం గుర్తుంచుకున్న అతి కొద్ది మందిలో ఇందిరగాంధీ కూడా ఉన్నారని ఆమె మన మధ్య లేకున్నా ఆమె పాలన ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. గ్రీన్ రివల్యూషన్, గరీభీ హటావో లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను అమె తీసుకున్నారని, అవే ప్రస్తుతం దేశప్రజలకు ఇప్పటికీ శ్రీరామ రక్షగా మారాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indira Gandhi  Pranab Mukherjee  Sonia Gandhi  Manmohan Singh  Teen Murti Bhavan  Congress  

Other Articles