Bride refuses to marry drunken groom in dry Bihar మద్యం తాగిన వరుడ్ని పెళ్లి చేసుకోనన్న వధువు.. ఇంకా..

Bride refuses to marry drunken groom in dry bihar

bridegroom rejected, mukhiya, alcohol, dry Bihar, prohibition, marriage, Ram Pravesh Das, Lalan Kumar Das, alcohol ,Kamalpura village, Muzaffarpur district, hostage

The young bride not only refused to marry the groom, but her family also held hostage the groom and his close relatives till they returned all that the family had taken as dowry.

మద్యం తాగిన వరుడ్ని పెళ్లి చేసుకోనన్న వధువు.. ఇంకా..

Posted: 05/13/2017 05:32 PM IST
Bride refuses to marry drunken groom in dry bihar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి, దాన్ని అమ‌లు పరుస్తుండ‌డం పట్ల ఆ రాష్ట్ర మ‌హిళ‌లు ఎంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల త‌మ బ‌తుకులు నాశ‌నం అవుతాయ‌ని, అందుకే మ‌ద్యం తాగే వారిని పెళ్లి చేసుకోకూడ‌ద‌ని ఆ రాష్ట్ర యువ‌తులు ఎంతో ధైర్యంతో గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవ‌లే బీహార్‌లో అలాంటి మందుబాబులైన ముగ్గురు వరులను పెళ్లాడేందుకు నిరాకరించిన అమ్మాయిల వార్త దేశ వ్యాప్తంగా వార్త‌ల్లోనూ నిలిచింది. తాజాగా ఓ పెళ్లి కూతురు కూడా అటువంటి ప‌నే చేసి మందుతాగే యువ‌కుడికి మంచి బుద్ధి చెప్పింది. పెళ్లి పీట‌లవ‌ర‌కూ వ‌చ్చిన త‌న‌ పెళ్లిని ఆపేసి మ‌రీ ఆ తాగుబోతుని పెళ్లాడ‌బోన‌ని చెప్పేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.... ఆ రాష్ట్రంలోని వైశాలీ జిల్లా హారౌలీభట్టీకి చెందిన చందన్ చౌదరి అనే యువ‌కుడికి ఓ యువ‌తితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. యువ‌తి మెడ‌లో తాళి క‌ట్టేందుకు తన బంధుమిత్రులతో కలిసి సంద‌డిగా పెళ్లి పందిరిలోకి వ‌చ్చాడు. పురోహితుడు వేద మంత్రోచ్చారణలతో పెళ్లి జ‌రిపిస్తున్నాడు. ఆ సమయంలో త‌న‌ ముందు కూర్చున్న వ‌రుడి నోట్లోంచి మ‌ద్యం వాస‌న రావ‌డం గ‌మ‌నించిన స‌ద‌రు వ‌ధువు త‌న‌కు ఆ వ‌రుడు వ‌ద్ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేసింది. ఇక‌, వరుడి తల్లిదండ్రులకు ఇచ్చిన క‌ట్నాన్ని తిరిగి తీసుకొని ఆ వ‌రుడి కుటుంబానికి దండం పెట్టి, పెళ్లి పెద్దలు వారిని తిరిగి ఇంటికి పంపించేశారు. మ‌ద్య నిషేధం అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు బీహారీల‌కు అక్ర‌మంగా మందు, నాటు సారా దొరుకుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  bridegroom  alcohol  dry bihar  prohibition  mukhiya  ram pravesh das  hostage  

Other Articles