Pakistan Confiscates Indian Diplomat phone

Pakistan seizes indian diplomat s phone

Pakistan Seizes Indian Diplomat, Uzma Case, Uzma Pakistan, Pakistan Indian Diplomat, Indian Diplomat Phone Seize, Uzma India, India Pakistan Uzma Case, Indian Diplomat Insult

Pakistan seizes Indian diplomat's phone during Uzma Case Court Hearing.

ఉజ్మా కేసులో పాక్ వివాదాస్పద ఆదేశాలు

Posted: 05/12/2017 02:25 PM IST
Pakistan seizes indian diplomat s phone

పాకిస్థాన్ లో చిక్కకుపోయిన ఇండియన్ యువతి ఉజ్మా ఉదంతం మలుపు తిరిగింది. సాయం చేస్తామంటూనే అక్కడి అధికారులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. తాను ఇటీవలే వివాహమాడిన యువతిని పాకిస్థాన్ లోని ఇండియన్ దౌత్య కార్యాలయంలో బంధించారని ఓ వ్యక్తి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఉజ్మా మాత్రం మోసపోయి తాను ఇండియాకు వెళ్లటానికే ఇక్కడికి వచ్చానని చెప్పటంతో విషయం ఇరు దేశాల విదేశాంగ శాఖలు జోక్యం చేసుకునేదాకా వెళ్లింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ఇస్లామాబాద్ కోర్టు ఆదేశాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. భారత దౌత్య కార్యాలయ సెక్రటరీ సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. అంతేకాదు కేసు విచారణ జరిగే వరకు నగరం విడిచి రాదన్న ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది...

 

న్యూఢిల్లీకి చెందిన ఉజ్మా, తహీర్‌ ఇద్దరూ మలేషియాలో కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఉజ్మా మే 1న వాఘా సరిహద్దు దాటుకుని పాకిస్తాన్‌ చేరకుంది. మే 3వ తేదీన ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే తహిర్‌ కధనం మేరకు దౌత్య కార్యాలయానికి వెళ్ళి అక్కడ వీసాకోసం దరఖాస్తు చేసుకోవాలని యత్నిస్తే లోపలికెళ్లిన భార్య ఎంతసేపటికి తిరిగి రాకపోయే సరికి అధికారులను విచారించానని తహీర్‌ చెప్పాడు. చివరకు ఆమెను బంధించారని పాక్‌ విదేశాంగ కార్యాలయ అధికారి జాకిరియా ప్రకటన చేసి దుమారం రేపాడు.

కానీ, తలకు తుపాకీ గురిపెట్టి అలీ తనను వివాహమాడాడని అతని భార్య ఉజ్మా(20) ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇస్లామాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడమే కాకుండా మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. అలీ తన ఇమిగ్రేషన్‌ డాక్యుమెంట్లను సైతం లాక్కున్నాడని పేర్కొంది. తనను స్వదేశం ఇండియాకు తనను తిరిగి పంపించాలని కోరింది. మరోవైపు ఉజ్మా కేవలం విజిటింగ్‌ వీసాలతోనే తమ దేశంలోకి అడుగుపెట్టినట్లు పాక్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ దౌత్య కార్యాలయాన్ని త్వరలోనే సంప్రదించి సమస్యను పరిష్కరిస్తుందని ముందు చెప్పిన అధికారులు, తర్వాత ఇలా మాట మార్చి ఫోన్ ను స్వాధీన పరుచుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Diplomat  Phone Sieze  Pakistan  Islamabad Court  

Other Articles