pawan kalyan jana sena supports chalo dharna chowk ‘‘చలో ధర్నా చౌక్’’కు పవన్ కల్యాన్ మద్దతు

Pawan kalyan jana sena supports chalo dharna chowk on may 15th

pawan kalyan on farmers, pawan kalyan on mirchi msp, pawan kalyan on chalo dharna chowk, pawan kalyan first agitation support in telangana, pawan kalyan, jana sena, chalo dharna chowk, cpm, gaddar, politics

Actor turned politicain, jana sena party chief power star pawan kalyan gives support to chalo dharna chowk which is leading by left parties and it is the first agitation which jana sena supports in telangana

‘‘చలో ధర్నా చౌక్’’కు పవన్ కల్యాన్ జనసేన మద్దతు

Posted: 05/11/2017 07:10 PM IST
Pawan kalyan jana sena supports chalo dharna chowk on may 15th

ప్రజాస్వామ్యంలో ధర్నా చేసేందుకు ఎవరికైనా హక్కుందని.. ప్రజలు తాము అశిస్తున్న న్యాయం తమకు జరగనప్పుడు గొంతెత్తే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్‌ కల్యాన్ అన్నారు. ప్రజాసమస్యలపై గొంతెత్తే వేదిక ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ ను అక్కడి నుంచి తరలిచండం సమంజసం కాదని ఆయన అన్నారు. శాంతియుతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవటం ప్రభుత్వాలకు మంచిదనిపించుకోదని అన్నారు.

ధర్నాచౌక్ కోసం వామపక్షాల అధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్దర్ నేతృత్వంలో జరుగుతున్న పోరాటానికి జనసేన మద్దతిస్తుందని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా దర్నా చౌక్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే అందోళనలో పాల్గోంటారని చెప్పారు. దీంతో జనసేన అవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణలో అందోళనకు మద్దుతును ప్రకటించింది. మరోవైపు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన రైతులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువెళ్లడాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు.

ఇక మరోవైపు ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించటం లేదని పవన్ స్పష్టం చేశారు. తాను హిందీ భాషకు చాలా ప్రాధాన్యత ఇస్తానన్నారు. తన సినిమాల్లో కూడా హిందీ పాటను కూడా వుందని అదే తానిచ్చే ప్రాధాన్యమన్నారు. ఉత్తరాదివారి మాదిరిగానే దక్షిణాది వారికీ అవకాశాలు కల్పించాలని మాత్రమే తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నియామకానికి తాను వ్యతిరేకం కాదన్నారు. అహ్మదాబాద్‌లో మోదీని కలిసినప్పుడు కూడా ఉత్తరాది, దక్షిణాది అంశాలను వివరించానని, దక్షిణాది ప్రజల పట్ల చిన్నచూపు చూస్తున్న అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని కూడా చెప్పారు. దేశం సమగ్రతను, ఐక్యతను కోరుకునేవారు సమస్యలపై గొంతెత్తాలని పవన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  chalo dharna chowk  cpm  gaddar  politics  

Other Articles