YS Jagan fulfills Kurnool boy's wish మైనర్ బాలుడి కోరికను తీర్చిన వైఎస్ జగన్

Ys jagan fulfills kurnool boy s wish

ys jagan genrous, ys jagan minor boy, ys jagan bethamcherla boy, ys jagan kurnool boy wish, YS Jagan. Hyderabad. Kurnool boy’s wish. genrous, politics

Andhra Pradesh opposition leader YS Jagan is quite busy but did mot forgot to fullfill the wish of a kurnool minor boy, who came all the way from kurnool without informing to parents.

మైనర్ బాలుడి కోరికను తీర్చిన వైఎస్ జగన్

Posted: 05/07/2017 11:28 AM IST
Ys jagan fulfills kurnool boy s wish

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగన్ ను చూడాలని, ఆయనతో మాట్లాడాలన్న కోరికతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలుడ్ని అయన దగ్గరకు చేర్చుకుని రెండు రోజుల పాటు తన నివాసంలోనే ఉండనిచ్చారు. ఆ బాలుడికి తనపై వున్న అభిమానంతో ఓ ఫోటో దిగి.. దానిని లామినేషన్ చేయించి మరీ ఇచ్చారు. సినిమా తారల కోసం మాత్రమే ఇళ్లు విడిచి వెళ్లే బాలురు ఘటనలు విన్న మనకు రాజకీయ నేతల కోసం కూడా బాలురు ఇలా ఇల్లు విడిచి రావడం విచిత్రమే.

అయితే ఈ ఏడో తరగతి చదివే విద్యార్థి పెద్ద సాహసాన్ని చేయడంతో పాటు తన కొరికను కూడా తీర్చుకున్నాడు. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన పన్నెండేళ్ల ప్రసాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అతనికి జగన్ అంటే ఎంతో అభిమానం. ఎలాగైనా ఆయన్ను కలవాలన్న కోరికతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కి వచ్చేశాడు. కాచిగూడలో దిగిన ప్రసాద్, తనకు కనిపించిన వారినందరినీ జగన్ ఇంటి గురించి వాకబు చేస్తూ, వైకాపా కార్యాలయం వరకూ వచ్చాడు.

ఆఫీస్ దగ్గరికైతే వచ్చాడు కానీ, లోపలికి వెళ్లి జగన్ ను ఎలా కలవాలో తెలియక ఉండిపోయాడు. చివరికి తానెవరు? ఎందుకు వచ్చానన్న వివరాలను అక్కడి సెక్యూరిటీకి చెప్పి, జగన్ ను కలిసేలా చేయాలని ప్రాధేయపడ్డాడు. జగన్ ను కలవడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా, వినకుండా అక్కడే ఉండిపోయాడు. బాలుడి విషయం తెలుసుకున్న జగన్, అతన్ని లోపలికి పిలిపించుకున్నారు. భోజనం పెట్టించి, క్షేమ సమాచారాలు అడిగారు. తనతో ఫోటో తీయించి, దాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. అతని క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. రెండు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని ఆతిథ్యం ఇచ్చి, ఆపై ఇంటికి పంపారు. ఇక తన అభిమాన నేత ఇచ్చిన ఆతిథ్యానికి ప్రసాద్ ఉబ్బితబ్బిబ్బవుతూ ఇల్లు చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan. Hyderabad. Kurnool boy’s wish. genrous  politics  

Other Articles