Historic moment, says PM on launch of South Asian Satellite నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09

Isro successfully launches southasia communication satellite

GSLV-F09, south asia, satellite launch, srihari kota, satish dhawan space research center, southasia communication satillite, PM Modi

India today successfully launched the South Asia Communication Satellite, fully funded by it and touted as an "invaluable gift" to its South Asian neighbours, that would provide communication and disaster support to the nations of the region.

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09.. ప్రధాని అభినందనలు

Posted: 05/05/2017 05:05 PM IST
Isro successfully launches southasia communication satellite

అప్రతిహాత విజయాలతో అనేక మైలురాయిలను దాటుకుంటూ.. విజయాలను తన సిగలో మల్లెల మాదిరిగా తీర్చిదిద్దకుంటున్న ఇస్రో.. తాజాగా ప్రయోగించిన జీశాట్ ఎఫ్09 ఉపగ్రహ ప్రయోగాన్ని కూడా విజయవంతమైంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ పెంటర్ నుంచి సరిగ్గా సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత వ్యవధిలో నిర్ణత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి క్రితం రోజు మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ వాహన నౌక ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్‌–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్‌) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టా. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సమాచార వ్యవస్థకు సంబంధించిన సేవలను అందించనుంది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఈ సమాచార ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.235కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించింది.

ఇస్రో సాధించిన మ‌రో విజ‌యంపై ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల‌ను అభినందించారు. ఇస్రో మ‌రో చ‌రిత్రాత్మక ప్రయోగంలో విజ‌యవంతంగా పూర్తి చేసింద‌ని ఆయ‌న అన్నారు. ప్రధాని మోదీ ద‌క్షిణాసియా అగ్రనేత‌ల‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడ‌ారు. సార్క్ దేశాల సదస్సలో భారత్ ఆయా దేశాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు అయ్యిందని ప్రధాని అన్నారు. దక్షిణాసియా దేశాలన్నీ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉన్నాయ‌ని మోదీ అభివ‌ర్ణించారు. ఈ ఉపగ్రహం ద్వారా ఇంట‌ర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌, డీటీహెచ్ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చని, అత్యాధునిక స‌మాచార వ్యవ‌స్థను అందుకోవ‌చ్చని తెలిపారు. ఈ ప్రయోగం జరిగిన రోజు చారిత్రాత్మమైనదిగా అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles